Friday, January 9, 2026
E-PAPER
Homeతాజా వార్తలుబీసీల 42 శాతం రిజర్వేషన్ పై పార్లమెంట్లో చర్చ

బీసీల 42 శాతం రిజర్వేషన్ పై పార్లమెంట్లో చర్చ

- Advertisement -

నవతెలంగాణ – ఆలేరు : తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతించాలని భువనగిరి ఎంపీ శ్యామల కిరణ్  కుమార్ రెడ్డి కోరారు. మంగళవారం నాడు ఢిల్లీలో పార్లమెంటు సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో అన్ని పార్టీలు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపాయి అన్నారు. ఆరు నెల క్రితమే బీసీ రిజర్వేషన్ బిల్లుని గవర్నర్ వద్దకు పంపించాము గవర్నర్ ఇంతవరకు ఏలాంటి నిర్ణయం తీసుకోకుండా జాప్యం చేస్తున్నారని చెప్పారు. ఓ బీ సీ ప్రధాని దేశాన్ని పాలిస్తున్న మోడీ జోక్యం చేసుకొని బీసీ రిజర్వేషన్ బిల్లును ఆమోదింప చేయాలని కోరారు. తెలంగాణలో బిసి ప్రజలకు స్థానిక సంస్థల్లో విద్యా ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు తీసుకువచ్చిన 42 శాతం బిల్లుకు ఆమోదం తెలపాలని కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -