నవతెలంగాణ-హైదరాబాద్ : తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ మరో శుభవార్తను అందించింది. రాగల మూడు రోజుల్లో రాష్ట్రంలో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది.
రాగల మూడు రోజుల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 నుంచి 5 డిగ్రీలు తక్కువగా నమోదవుతాయని వాతావరణ శాఖ పేర్కొంది. నైరుతి రుతుపవనాలు మరింత పురోగమిస్తాయని చెప్పింది. వేసవి ఉష్ణోగ్రతలతో అల్లాడుతూ, ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న నగరవాసులకు ఇది నిజంగా చల్లటి కబురే.
ఆదివారం నగరంలో చిరుజల్లులు కురవడంతో వాతావరణం చల్లబడింది. హైదరాబాద్ నగరంలోని కొండాపూర్, కూకట్‌పల్లి, సికింద్రాబాద్, ఎల్బీ నగర్ తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది. దీంతో రోడ్లపైన వర్షపు నీరు ప్రవహించడంతో పలు ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడి ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు.
తెలంగాణలో మూడు రోజుల పాటు వర్షాలు
- Advertisement -
- Advertisement -



