డాలర్‌తో పోల్చితే 90.33కి క్షీణత
ముంబయి : అంతర్జాతీయ ద్రవ్య మార్కెట్‌లో రూపాయి విలువ కుప్పకూలుతోంది. భారతదేశ చరిత్రలోనే ఎప్పుడూ లేని స్థాయిలో పతనమవు తోంది. అమెరికా, భారత్ మధ్య చోటు చేసుకుంటున్న టారిఫ్ ఆందోళనలు, దేశీయ, అంతర్జాతీయ స్టాక్ మార్కెట్లలో ఒత్తిడి రూపాయి విలువను అగాథం లోకి నెట్టింది. గురువారం డాలర్‌తో రూపాయి మారకం విలువ మరో 39 పైసలు పతనమై 90.33కి దిగజారింది.ఫారెక్స్‌్ మార్కెట్‌లో ఉదయం 89.95 వద్ద ప్రారంభమైన రూపాయి విలువ ఓ దశలో 54 పైసలు కోల్పోయి 90.48 ఇంట్రాడేలో ఆల్‌టైం కనిష్టాన్ని చవి చూసింది. బుధవారం 7 పైసలు తగ్గి 89.94 వద్ద ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్‌లో బ్యారెల్ ముడి చమురు ధర 1.25 శాతం తగ్గి 61.43 డాలర్లుగా నమోదయ్యింది. మార్కెట్ల వరుస పతనం,తరలిపోతున్న విదేశీ సంస్థాగత మదుపర్ల (ఎఫ్‌ఐఐ) పెట్టుబడులు భారత కరెన్సీకి విలువ లేకుండా చేస్తోన్నాయి. బుధవారం సెషన్‌లో భారత స్టాక్ మార్కెట్ల నుంచి రూ.1,651.06 కోట్ల ఎఫ్‌ఐఐలు తరలిపోయాయి.
ఆగని రూపాయి పతనం
- Advertisement -
- Advertisement -



