Friday, December 12, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అవకాశం ఇవ్వండి.. అభివృద్ధి చేసి చూపిస్తా

అవకాశం ఇవ్వండి.. అభివృద్ధి చేసి చూపిస్తా

- Advertisement -

గ్రామస్తులందరికీ ఉచిత అంబులెన్స్ సేవలు
తల్లిదండ్రులు లేని పిల్లలకు ఉచిత విద్య 
సర్పంచ్ అభ్యర్థి తేజశ్రీ -విశ్వేశ్వర చారి 
నవతెలంగాణ – అచ్చంపేట
మండల పరిధిలోని నడింపల్లి గ్రామ సర్పంచ్ గా గ్రామస్తులు అందరూ టూత్ పేస్ట్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి తేజశ్రీ-విశ్వేశ్వర చారి ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. శుక్రవారం గ్రామంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ అభ్యర్థి తేజశ్రీ మాట్లాడారు. గ్రామస్తులందరూ ఆశీర్వదించి సర్పంచ్ గా ఒక్కసారి ఆకాశం ఇవ్వండి.. అభివృద్ధి చేసి చూపిస్తానని, మీరందరూ ఆశీర్వదించి టూత్ పేస్ట్ గుర్తు కు ఓటు వేసి సర్పంచ్ గా గెలిపిస్తే.. గ్రామంలో అత్యవసర సమయంలో గ్రామస్తులందరికీ ఉచిత అంబులెన్స్ సేవలు అమలు చేస్తానని, తల్లిదండ్రులు లేని పిల్లలకు ఉచిత విద్యను చదివిస్తానని గ్రామస్తులకు ప్రచారంలో హామీ ఇచ్చారు.

గ్రామంలో మురుగు నీరు నిలవకుండా డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరుస్తారని తెలిపారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచే విధంగా కృషి చేస్తానన్నారు. ప్రభుత్వ నుంచే వచ్చే వివిధ సంక్షేమ పథకాలు అర్హులైన అందరికీ అందే విధంగా నేనే స్వయంగా పరిశీలిస్తానని తెలిపారు. గ్రామంలో ఏ కుటుంబానికి ఆపద వచ్చిన ఏ సమయంలో అయినా అందరికీ అందుబాటులో ఉండి సమస్య పరిష్కారానికి సహకరిస్తానన్నారు. నిరుద్యోగ యువతకు, విద్యార్థులకు వినియోగించుకునే విధంగా గ్రామంలో గ్రంథాలయాన్ని ఏర్పాటు చేస్తానన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -