Friday, December 12, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అందరు మెచ్చిన మంచి నాయకున్ని ఎన్నుకోవాలి: కలెక్టర్

అందరు మెచ్చిన మంచి నాయకున్ని ఎన్నుకోవాలి: కలెక్టర్

- Advertisement -

నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
గ్రామాలు అభివృద్ధి చెందాలంటే గ్రామాల కోసం పాటుపడేవారిని, అందరూ మెచ్చిన మంచి నాయకులని ఎంచుకోవాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అన్నారు. శుక్రవారం గ్రామ పంచాయతీ  మూడవ విడత ఎన్నికల్లో బాగంగా ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు  మూడవ విడత పోలింగ్ జరిగే మండలాల్లో ఓటు అవగాహన  కార్యక్రమాలు చేపట్టడం జరిగింది.( నారాయణపూర్ మండల కేంద్రంలో  పాల్గొన్న జిల్లా కలెక్టర్ హనుమంతరావు, చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలో ఆర్డీవో శేఖర్ రెడ్డి, అడ్డగూడూరు మండల కేంద్రంలో తాసిల్దార్ శేషగిరి రావు, ఎంపీడీవో, గుండాల మండల కేంద్రంలో అడిషనల్ డిఆర్డిఓ సురేష్, ఓటర్లకు ఓటు పై అవగాహన  కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందన్నారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్  ముందుగా ఓటర్లతో తమ ఓటును డబ్బుకు ,మద్యానికి, ఇతరత్ర ప్రలోభాలకు లొంగకుండా నిజయమైన , ఒక మంచి సర్పంచ్ కానీ వార్డు మెంబర్ ను కానీ ఎంచుకుంటామని ప్రతిజ్ఞ చేయించారు. ఓటు హక్కుప్రజాస్వామ్య పునాది అని,ఓటరు గా నమోదు అయిన ప్రతీ ఒక్కరు ఓటు వేయాలన్నారు.ఓటు హక్కు వినియోగం, అవగాహన ర్యాలీలు విద్యార్థులకి అవగాహన కల్పించడం వలన వాళ్ళు  వాళ్ల ఇంట్లో పెద్ద వాళ్ళకి  చెప్పడంతో మార్పు వస్తుందన్నారు.ఇప్పుడు విద్యార్థుల కావొచ్చు కానీ రాబోయే రోజుల్లో విద్యార్థులందరూ  ఓటర్ లు అవుతారన్నారు.ఓటర్లు డబ్బులకు, మద్యానికి, గిఫ్ట్ లకి,బిర్యానీకి లేక వేరే ఇతర కానుకలలు  ఇచ్చేవారికి  ఓటు వేస్తే ఎన్నికల తర్వాత గెలిచిన అభ్యర్థిని గ్రామం అభివృద్ధి పై  అడిగే హక్కుని కోల్పోతాం అన్నారు.

మీ ఇంట్లో లేదా మీరు కలిసి పని చేసే చోట మంచి నాయకులను ఎంచుకోవడం వలన మన గ్రామం అభివృద్ధి చెందుతుందని  చర్చించుకోవాలన్నారు. అభ్యర్థులు ఇచ్చే ప్రలోభాలకు లోబడకుండా ఒక మంచి వ్యక్తిని అందరూ మెచ్చే విధంగా ఎంచుకోవాలన్నారు. ఎవరికి ఓటు వేస్తే మనకి ఉపయోగం ఉంటుందని, అవసరానికి ఎవరైతే అందుబాటులో ఉంటారో, ఎవరు అభివృద్ధి చేస్తారో అని అందరూ కలసి చర్చించుకోవాలన్నారు.

గ్రామాలు బాగున్నపుడే పట్టణాలు , నగరాలు అభివృద్ధి చెందుతాయన్నారు. గ్రామాలు బాగుండాలంటే మంచి నాయకుడిని ఎన్నుకోవాలని సూచించారు. ఇటీవల మన జిల్లాలో బొమ్మల రామారం, వలిగొండ మండలాల్లో ఓటు అవగాహన పై ర్యాలీలు, ఓటు అవగాహన చైతన్య కార్యక్రమాలు చేపట్టడం జరిగింది.   ఓటర్లు అవగాహన కలిగి కొంతమంది మహిళా ఓటర్లు మేము మా ఓటు హక్కును అమ్ముకోము అని స్వతహాగా వాళ్ల ఇండ్ల ముందు బోర్డులు పెట్టి ఓటు హక్కును వినియోగించుకున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -