Friday, January 2, 2026
E-PAPER
Homeబీజినెస్కాలిఫోర్నియా బాదంతో మీ చర్మానికి తగిన సంరక్షణను అందించండి

కాలిఫోర్నియా బాదంతో మీ చర్మానికి తగిన సంరక్షణను అందించండి

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: ఆహ్లాదకమైన రాత్రులు, పండుగ ఉత్సాహంతో శీతాకాలం వచ్చింది, అయినప్పటికీ ఇది చాలా మందికి సుపరిచితమైన సవాళ్లను కూడా తెస్తుంది. చర్మం పొడి బారటం , నిస్సత్తువగా మారటం , సున్నితమైన రీతిలో మారటం వంటి సమస్యలు ఈ కాలంలో ఎక్కువగా కనిపిస్తాయి. చల్లని గాలి మన చర్మం నుండి తేమను లాడేసుకుంటుంది. చర్మం పొలుసులుగా మారి, చికాకుకు గురిచేస్తుంది. సమయోచతంగా తీసుకునే  చర్మ సంరక్షణ సహాయపడుతుంది. కానీ శాశ్వత పోషణ లోపల నుండి ప్రారంభమవుతుంది. శీతాకాలపు చర్మ సంరక్షణకు అత్యంత ప్రభావవంతమైన విధానం మీ శరీరానికి సరైన ఆహారాలను అందించటంలో ఉందని పోషకాహార నిపుణురాలు రితికా సమద్దర్ వివరిస్తున్నారు.

శీతాకాలంలో పొడిబారడం అనేది చర్మ సంరక్షణకు సంబంధించిన విషయం మాత్రమే కాదు, పోషక ఆహార సమస్య కూడా అని ఆమె వివరిస్తున్నారు. కొవ్వు పట్టిన చేపలు మరియు కాలిఫోర్నియా బాదం వంటి ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్ E మరియు ఒమేగా-3 అధికంగా ఉండే ఆహారాలను తీసుకోవడం యొక్క ప్రాముఖ్యతను ఆమె వెల్లడించారు. మీ రోజువారీ ఆహారంలో బాదంను చేర్చుకోవడం వల్ల చర్మానికి లోపలి నుండి పోషణ అందించవచ్చు, కఠినమైన వాతావరణ పరిస్థితులలో కూడా చర్మం మృదువుగా, హైడ్రేటెడ్‌గా, ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడుతుంది.

 అనేక విధాలుగా చర్మ ఆరోగ్యానికి మద్దతు ఇచ్చే ముఖ్యమైన పోషకాలకు శక్తివంతమైన వనరు, బాదం.  చర్మాన్ని దెబ్బతినకుండా రక్షించే ముఖ్యమైన యాంటీఆక్సిడెంట్, విటమిన్ E యొక్క అత్యంత సంపన్నమైన సహజ వనరులలో ఒకటి ఇది.  విటమిన్ E చర్మం యొక్క సహజ అవరోధాన్ని కూడా బలపరుస్తుంది, తేమను నిలుపుకోవడానికి , కఠినమైన శీతాకాలంలో మృదువుగా ఉండటానికి సహాయపడుతుంది. దీనితో పాటు, విటమిన్ E మీ చర్మం స్థిరత్వంను కాపాడుకోవడానికి సహాయపడే యాంటీ-ఏజింగ్ లక్షణాలను కూడా కలిగి ఉంటుంది.

కాలిఫోర్నియా బాదంలు శీతాకాలంలో తప్పనిసరిగా తీసుకోవటానికి మరొక కారణం వాటిలో ఆరోగ్యకరమైన మోనోశాచురేటెడ్ కొవ్వులు అధికంగా ఉండటం. ఈ ఆరోగ్యకరమైన కొవ్వులు అంతర్గత మాయిశ్చరైజర్‌లుగా పనిచేస్తాయి, చర్మ స్థిరత్వంను మెరుగుపరుస్తాయి, అధిక పొడిని నివారిస్తాయి. ఇవి చర్మం బొద్దుగా మరియు మృదువుగా కనిపించడానికి సహాయపడతాయి, అదే సమయంలో చల్లని వాతావరణంలో కనిపించే సన్నని గీతల దృశ్యమానతను తగ్గిస్తాయి.

బాదంలో ప్రోటీన్, రిబోఫ్లేవిన్ మరియు జింక్ కూడా పుష్కలంగా ఉంటాయి, ఇవన్నీ మొత్తం చర్మ ఆరోగ్యాన్ని నిర్వహించడానికి దోహదం చేస్తాయి. ఈ పోషకాలు చర్మ ప్రకాశమును పునరుద్ధరించడానికి, నీరసాన్ని తగ్గించడానికి మరియు బలమైన చర్మ అవరోధానికి మద్దతు ఇస్తాయి. బాదంలను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ముఖ చర్మపు రంగును మెరుగుపరచడంలో మరియు ముడతలు కనిపించడాన్ని తగ్గించడంలో సహాయపడతాయని పరిశోధనలు సూచిస్తున్నాయి.

 పేగుల ఆరోగ్యం మరియు చర్మ ఆరోగ్యం మధ్య సంబంధాన్ని కూడా రితికా వెల్లడించారు. బాదంలు పేగు ఆరోగ్యంకు మద్దతు ఇస్తాయని అధ్యయనాలు చూపించాయి, మంట మరియు పగుళ్లను ఇవి తగ్గిస్తాయి. జీర్ణ సమస్యలు ఎక్కువగా ఉండే శీతాకాలంలో ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. పోషకాల శోషణను మెరుగుపరచడానికి కాలిఫోర్నియా బాదంపప్పులను రోజువారీ భోజనంలో చేర్చుకోవాలని మరియు ఉదయం వాటిని తినాలని ఆమె సిఫార్సు చేస్తోన్నారు.

ఈ శీతాకాలంలో, మెరిసే చర్మం ఖరీదైన చికిత్సలు లేదా సంక్లిష్టమైన దినచర్యల నుండి మాత్రమే రావాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు అందం కు సంబంధించి అత్యంత శక్తివంతమైన పరిష్కారాలు సరళమైన, రోజువారీ పోషణ ద్వారా కూడా వస్తాయి. వాటి అసాధారణమైన పోషక ప్రొఫైల్‌తో, కాలిఫోర్నియా బాదంపప్పులు సీజన్ అంతా మీ చర్మాన్ని జాగ్రత్తగా చూసుకోవడానికి సహజమైన, ప్రభావవంతమైన మరియు రుచికరమైన మార్గాన్ని అందిస్తాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -