- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం జంగంపల్లి గ్రామ శివారులో ఆగి ఉన్న టిప్పర్‌ను ఓ కంపెనీ బస్సు ఢీ కొట్టింది. స్టాఫ్‌ను ఎక్కించుకోవడానికి వెళ్తున్న క్రమంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో టిప్పర్ డ్రైవర్ శ్రావణ్ కుమార్ తలకు తీవ్ర గాయాలవడంతో అతన్ని కామారెడ్డి జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు. బస్సు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. బస్సులో ప్రయాణికులు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.
- Advertisement -



