నవతెలంగాణ – సారంగాపూర్
గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారంలో డిసిసి అధ్యక్షులు వెడ్మ బొజ్జు పటేల్, మాజీ కేంద్ర మంత్రి వేణుగోపాల్ చారి, మాజీ డిసిసి కూచాడి శ్రీహరి రావు, టిపిసిసి ప్రధాన కార్యదర్శి ఎంబడి రాజేశ్వర్, మాజీ జడ్పీ ఫోరమ్ అద్యక్షులు రాజేశ్వర్ రెడ్డి, అధికార పార్టీ బలపరిచిన అభ్యర్థులకు ఓటు వేసి గ్రామాలు అభివృద్ధి చేసుకుందామని అన్నారు. శుక్రవారం సారంగాపూర్ మండల కేంద్రంలో సర్పంచ్ అభ్యర్థి కునేరు భీమన్న, కౌట్ల(బి) అభ్యర్థి కారం దిలీప్,జామ్ లో అభ్యర్థి ప్రియాంక నవీన్ రెడ్డి లు తరపున గ్రామాల్లో గడపగడపకు వెళ్తూ బ్యాలెట్ నమునాను చూపిస్తూ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు.
రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలు వివరిస్తూ కాంగ్రెస్ అభ్యర్థులకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. కాంగ్రెస్‌తోనే పల్లె ప్రగతి సాధ్యమ వుతుందని గ్రామాల్లో మౌలిక సదుపా యాలతో పాటు మరింత అభివృద్ధి జరగా లంటే కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామాల అభివృద్ధి ధ్యేయంగా పని చేస్తున్నామన్నారు. దేశంలో ఎక్కడలేని విధంగా ప్రజలకు సన్న బియ్యం అందిస్తున్న ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందన్నారు. టిఆర్ఎస్ హయంలో సారంగాపూర్ మండలంలో ఒక్క డబుల్ బెడ్ రూమ్ కూడా ఇవ్వలేదని అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఇల్లు లేని పేదలకు ప్రతి గ్రామంలో ఇందిరమ్మ గృహాలను మంజూరు ఇవ్వడం జరిగింది అని అన్నారు. రేషన్ కార్డు లేని ప్రతి కుటుంబానికి రేషన్ కార్డు ఇవ్వడం జరిగిందని కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వమని అన్నారు.ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు బొల్లోజి నరసయ్య, సారంగాపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ అబ్దుల్ హాది, జిల్లామాజీ గ్రంథాలయ చైర్మన్ ఎర్రవోతు రాజేందర్, మార్కెట్ కమిటీ చైర్మన్ రాజ్మోహమ్మద్, మహిళా కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కృష్ణవేణి,మాజీ సర్పంచ్ పోతిరెడ్డిసుజాత , ఎంపిటిసి పద్మ వీరయ్య,నాయకులు కొట్టే శేఖర్, గాజుల రవికుమార్ జూనియ గాజుల రవికుమార్, ఉన్నారు.



