Friday, December 12, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్తంగడపల్లి ఉపసర్పంచ్‌గా ఇప్పపల్లి రాజు ఎన్నిక

తంగడపల్లి ఉపసర్పంచ్‌గా ఇప్పపల్లి రాజు ఎన్నిక

- Advertisement -

నవతెలంగాణ – సదాశివపేట
సదాశివపేట మండలంలోని తంగడపల్లి గ్రామంలో జరిగిన గ్రాంపంచాయతీ ఎన్నికల అనంతరం, 10కి 10 వార్డులలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. ఈ సందర్భంగా వార్డు సభ్యులు ఏకగ్రీవంగా ఇప్పపల్లి రాజును ఉపసర్పంచ్‌గా ఎన్నుకున్నారు. ఉపసర్పంచ్‌గా ఎన్నికైన ఇప్పపల్లి రాజు మాట్లాడుతూ.. గత 40 సంవత్సరాలుగా తంగడపల్లి ఆరవ వార్డులో టిడిపి, బిఆర్ఎస్ పార్టీలే ఆధిపత్యం కలిగి ఉన్నప్పటికీ, కాంగ్రెస్ పార్టీకి ఈసారి ప్రజలు న్యాయం చేసి విజయం సాధించిపెట్టారని తెలిపారు. మొదటిసారిగా ఆరవ వార్డులో కాంగ్రెస్ జెండాను తానే ఎగరవేయడం గర్వంగా ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వెంకటాపురం రాములు, వడ్ల నాగేష్, ఇప్పపల్లి జగదీశ్వర్, నాయికోటి రాజు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -