లింగంపల్లి గురుకుల విద్యార్థుల కథ సుఖాంతం
నవతెలంగాణ-మునిపల్లి
సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం లింగంపల్లి గురుకుల పాఠశాలకు చెందిన ఇద్దరు విద్యార్థుల కిడ్నాప్ కథ సుఖాంతమైంది. అది కిడ్నాప్ కాదని, కేవలం పిల్లలు అల్లిన కట్టుకథగా విద్యార్థులు ఒప్పుకొన్నారు. వివరాల్లోకి వెళితే.. పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్న రాకేష్, సిద్ధూ.. కారులో వచ్చి తమను ఎవరో కిడ్నాప్ చేశారని స్కూల్‌కు దూరంగా ఉన్న పొలాల వద్ద అచేతన స్థితిలో కనిపించారు. ఇది గమనించిన గ్రామస్తులు మొదట జహీరాబాద్ ఆస్పత్రికి, అక్కడి నుంచి సంగారెడ్డి ఆస్పత్రికి తరలించారు. లోతుగా విచారించిన ఉపాధ్యాయ బృందం, ఇతర మండల శాఖ అధికారులు చివరకు పిల్లలను ఎవరూ కిడ్నాప్ చేయలేదని, అది పిల్లలు ఆడిన కిడ్నాప్ కథగా రుజువు చేశారు. ఇందుకు సంబంధించి ఎంపీడీవో హరినందన్ రావు పాఠశాలకు వెళ్లి విద్యార్థుల తల్లిదండ్రుల సమక్షంలో ఏం జరిగిందో చెప్పాలని విద్యార్ధులను వివరణ కోరారు. తమతో స్నేహంగా ఎవరూ ఉండటం లేదనే కారణంతో ఇలాంటి కిడ్నాప్ డ్రామా ఆడినట్టు విద్యార్థులు అధికారుల ఎదుట ఒప్పుకొన్నారు. సినిమాలు, సీరియల్ ప్రభావం కారణంగానే విద్యార్థులు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని ఉపాధ్యాయులు తెలిపారు. ఇందుకు సంబంధించి ఎంపీడీవో హరి నందనరావు, ప్రిన్సిపాల్ సురభి చైతన్యతో కలిసి.. విద్యార్ధులకు కౌన్సెలింగ్ ఇచ్చారు.
అది కిడ్నాప్ కాదు.పిల్లలు ఆడిన డ్రామా
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



