Monday, May 19, 2025
Homeతెలంగాణ రౌండప్ఎంపీ గడ్డంతో మాజీ ఎమ్మెల్యే పుట్టకు ఉన్న సంబంధం ఏంటి..?

ఎంపీ గడ్డంతో మాజీ ఎమ్మెల్యే పుట్టకు ఉన్న సంబంధం ఏంటి..?

- Advertisement -
  • – కాంగ్రెస్ పార్టీ జిల్లా ఎస్సిసెల్ అధ్యక్షుడు దండు సూటిప్రశ్న.?
    నవతెలంగాణ మల్హర్ రావు
    !
    కాంగ్రేస్ పార్టీ పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణకు,బిఆర్ఎస్ పార్టీకి చెందిన,మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మదుకర్ ఉన్న రహస్య సంబంధం ఏమిటని కాంగ్రెస్ పార్టీ భూపాలపల్లి జిల్లా ఎస్సిసెల్ అధ్యక్షుడు దండు రమేష్ సోమవారం ఒక ప్రకటనలో సూటిగా ప్రశ్నించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు ఎంపీ,మాజీ ఎమ్మెల్యే వాలకం చూస్తుంటే 2023 ఎమ్మెల్యే ఎన్నికల్లో మంథని నియోజకవర్గంలో ఖభాలీలను,కట్టప్పలను తయారు చేసింది మీరేనా.? అనే అనుమానం వస్తోందన్నారు.దళితుల పట్ల ఉన్న కపట ప్రేమను వోలకించడం కాదు 2014లో పుట్ట ఎమ్మెల్యేగా గెలువగానే మంథని నియోజకవర్గంలో జరిగిన నాలుగు దళిత హత్యలల్లో ఆరోపణలు ఎదుర్కొన్నది మీరు కాదాని గుర్తు చేశారు.ఇప్పటికే ఎస్సి,ఎస్టీ,బిసి,మైనారిటీ వర్గాలు రాజ్యాంగం లోని హక్కులను విధులను పొందుతూ రాజ్యాంగం పట్ల పూర్తి అవగాహన కలిగి ఉన్నారన్నారు.బిఆర్ఎస్  ప్రభుత్వ హయాంలో ఎస్సి,ఎస్టీ, బిసిలు ఇబ్బందులకు గురైయ్యారని,ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజలు స్వేచ్ఛగా చట్టాన్ని ఆశ్రయించి పోలీస్ స్టేషన్ల ద్వారా కోర్టుల ద్వారా న్యాయాన్ని పొందుతూ సమాజంలో గౌరవంగా ప్రశాంతమైన  జీవనాన్ని సాగిస్తున్నారని చెప్పారు.రాజ్యాంగ ఉల్లంఘనలు జరుగుతున్నాయని ఆరోపిస్తున్న పుట్ట హయాంలోనే అధికారుల చేత ఎన్ని రాజ్యాంగ ఉల్లంఘనలు చేపించారో గుర్తు లేదన్నారు. ప్రోటో కాల్లో ఎంపీకి నిజంగా అవమానం జరిగితే పార్లమెంటు ప్రివిలేజీ ఎథిక్స్ కమిటీకి లేదా కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేయాలి కానీ,పుట్టకు పిర్యాదు చేసినట్లుగా పుట్ట అత్యుత్సాహం చూపడం హాస్యపధంగా ఉందన్నారు.కాంగ్రెస్ పార్టీ నిర్ణయం మేరకు కట్టుబడి,ఎంపీ గెలుపు కోసం అహర్నిశలు కష్టపడి గెలిపించింది మంత్రి  శ్రీధర్ బాబు కాదని గుర్తు చేశారు.ఎంపీ పెద్దనాన్న వినోద్ నియోజకవర్గం బెల్లంపల్లిలో 21000 వేలు, నాన్న వివేక్ నియోజకవర్గం చెన్నూరులో 24000 మెజారిటీ మాత్రమే వస్తే మంత్రి శ్రీధర్ బాబు మంథని నియోజకవర్గంలో  53000 వేల అత్యధిక మెజారిటీ ఇచ్చి,ఎంపీ విజయంలో ప్రధాన భూమిక పోషించిన ఘనత శ్రీధర్ బాబు,రాష్ట్ర కాంగ్రెస్ యువ నేత శ్రీను బాబుల గొప్పతనం కాదని తెలిపారు.
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -