సింగర్ స్మిత ‘ఓజి క్వీన్ మసక మసక’ సాంగ్ గ్రాండ్‌గా లాంచ్ అయ్యింది. స్మిత, నోయల్ నటించిన ఈ సాంగ్‌ని విజయ్ బిన్నీ అద్బుతంగా డైరెక్ట్ చేశారు. జార్జ్.సి.విలియమ్స్ విజువల్స్, నాగేంద్ర తంగాల ఆర్ట్ డైరెక్టర్ డైరెక్షన్, అడెలె ఎడిటింగ్ ఈపాటకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ఈ సాంగ్ లాంచ్ ఈవెంట్‌లో దర్శకుడు దేవాకట్టా పాల్గొన్నారు. పాప్ సింగర్ స్మిత మాట్లాడుతూ,”హాయ్ రబ్బా’ ఆల్బమ్ దేశవ్యాప్తంగా పాపులర్ అయింది. అదే ఇంటి పేరుగా మారింది. ఇప్పుడు ఇంటిపేరు మార్చుకుని ‘ఓజి’ చేద్దామని అనుకున్నాం. ఈ సాంగ్‌ని నాగార్జున బిగ్ బాస్ స్టేజ్ మీద లాంచ్ చేశారు. సంక్రాంతికి మరో పాట వస్తుంది. ఆ పాట ఒక ఫెస్టివల్‌లాగా ఉంటుంది.
అలాగే మార్చి చివరి నుంచి లైవ్ షోస్ కూడా ఉంటాయి. హైదరాబాద్, ఆంధ్రాలో రెండు లొకేషన్స్, యూఎస్, దుబాయ్, ఆస్ట్రేలియా, సింగపూర్‌లో కూడా ఈవెంట్స్ ఉంటాయి’ అని తెలిపారు. డైరెక్టర్ విజయ బిన్నీ మాట్లాడుతూ,’నా సినిమా ప్రయాణంలో స్మిత చాలా కీలక పాత్ర పోషించారు. రెండు అద్భుతమైన పాటలు షూట్ చేసాం. మరో సాంగ్ కూడా రాబోతుంది’ అని తెలిపారు. ‘స్మిత కమ్ బ్యాక్ అందరికంటే ఎక్కువగా హ్యాపీనెస్ నాకే వచ్చింది. నేను ఇండిపెండెంట్ మ్యూజిక్ చేయడానికి ఇన్స్పిరేషన్ స్మిత. ఈ పాటలన్నీ కూడా మేం చాలా డెడికేషన్‌తో చేశాను. తప్పకుండా అలరిస్తాయి’ అని నోయల్ చెప్పారు.
సరికొత్తగా’మసక మసక’ సాంగ్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



