లౌక్య ఎంటర్టైన్మెంట్స్ అధినేత రవీంద్ర బెనర్జీ ముప్పానేని రూపొందిస్తున్న కొత్త చిత్రం ‘దండోరా’. ఇందులో శివాజీ, నవదీప్, నందు, రవికృష్ణ, మనికా చిక్కాల, మౌనికా రెడ్డి, బిందు మాధవి, రాధ్య, అదితి భావరాజు తదితరులు పాత్రధారులు. మురళీకాంత్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈనెల 25న మూవీ రిలీజ్ అవుతోంది. శనివారం ఈ సినిమా నుంచి టైటిల్ సాంగ్‌ని రిలీజ్ చేశారు.
ఈ సందర్భంగా నటుడు శివాజీ మాట్లాడుతూ, ‘తెలంగాణ రూటెడ్ ఫిల్మ్ ఇది. ఎమోషన్స్ ఉన్న కమర్షియల్ మూవీ. ఈ సినిమాలో ఎంటర్టైన్మెంట్, ఎమోషన్స్, డ్రామా, ఎగ్రెషన్ అన్నీ ఉన్నాయి. మంచి కంటెంట్ ఉన్న చిత్రమిది’ అని తెలిపారు. ‘మాకు ఈ సినిమాను డిస్ట్రిబ్యూట్ చేసే అవకాశం ఇచ్చిన నిర్మాత రవీంద్ర బెనర్జీకి థ్యాంక్స్. మేం సినిమాను చూశాం. కచ్చితంగా సినిమా హార్డ్ హిట్ సినిమాగా అన్నీ వర్గాల ప్రేక్షకులను మెప్పిస్తుంది’ అని మైత్రీ శశిధర్ చెప్పారు.
దర్శకుడు మురళీకాంత్ మాట్లాడుతూ, ‘మార్క్ అద్భుతమైన సంగీతాన్ని చ్చారు. తను కంపోజ్ చేసిన తొలి పాట ఇది. పాటలోని ఇంటెన్సిటీ అర్థమై ఉంటుందని అనుకుంటున్నాను. మరో పాటను రిలీజ్ చేయటానికి ప్లాన్ చేస్తున్నాం. ఈ సినిమాలో ఏం చెప్పాలనుకున్నామో థియేటర్స్‌కు వస్తే తెలుస్తుంది’ అని తెలిపారు. నిర్మాత రవీంద్ర బెనర్జీ ముప్పనేని మాట్లాడుతూ, ”దండోరా’ టైటిల్ సాంగ్ అందరికీ నచ్చే ఉంటుందని అనుకుంటున్నాను. పాటలో ఉన్న ఎమోషన్ ఏదైతే ఉందో.. అదే సినిమాలోనూ కనిపిస్తుంది. సినిమా చేసేటప్పుడు మాకు కొన్ని డౌట్స్ ఉండేవి. అయితే మంచి కంటెంట్‌ను ప్రేక్షకులు ఎప్పటికీ ఆదరిస్తారనే నమ్మకంతో ముందడుగు వేశాం. అదే నమ్మకం నిజమైంది. ఎందుకంటే సినిమా చూడగానే శశిధర్, నిరంజన్, మా ఓవర్సీస్ బయ్యర్ అథర్వణ భద్రకాళి పిక్చర్స్ సహా అందరికీ నచ్చింది. ఓవర్సీస్లో ఈనెల 23నే ప్రీమియర్స్ ఉంటాయి. ఇక్కడ కూడా ముందుగానే ప్రీమియర్స్ ఎప్పుడనే విషయాన్ని చెబుతాం’ అని అన్నారు.
మంచి కంటెంట్‌తో ‘దండోరా’
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



