Sunday, December 14, 2025
E-PAPER
Homeసోపతినిజాంస్టేట్‌లో సైలెంట్‌ సినిమాలపై ఆంక్షలు - నిషేధాలు

నిజాంస్టేట్‌లో సైలెంట్‌ సినిమాలపై ఆంక్షలు – నిషేధాలు

- Advertisement -

ఇది సరిగ్గా నూరేళ్ల కిందటి మాట. హైదరాబాదులోని ధీరేన్‌ గంగూలికి చెందిన థియేటర్లో ఒక సైలెంట్‌ సినిమా ప్రదర్శింపబడుతున్నది. సినిమా పూర్తి కాకమునుపే ఆ సినిమాలోని దశ్యాలను, సంఘటనలను వ్యతిరేకిస్తూ ముస్లిం సామాజిక వర్గానికి చెందిన వారంతా ఒక్కసారిగా థియేటర్‌ బయటకి వచ్చి నిరసన వ్యక్తం చేశారు.
ఇది జరిగింది 1924 ఏప్రిల్‌ మాసంలో. థియేటర్లో ప్రేక్షకుల నిరసనకు కారణమైన ఆ సినిమా పేరు ”రజియా బేగం”. అలా నిరసనతో థియేటర్‌ నుంచి ప్రేక్షకులు బయటికి వచ్చిన ఉదంతం హైదరాబాద్‌ సంస్థాన పాలకుడు నియంత నిజాం దష్టికి వచ్చింది .ఆయన వెంటనే ఆ సినిమాను ప్రత్యేక ప్రదర్శన వేయించుకుని చూసి తమ మనోభావాలు దెబ్బ తినేలా ఉన్న కథనం ”రజియా బేగం” సినిమాలో ఉన్నదని ఆ సినిమా ప్రదర్శనను నిషేదించారు. అంతేగాక ఆ వెంటనే తన మందీ, మార్బలంతో ధీరేన్‌ గంగూలీకి చెందిన లోటస్‌ ఫిలిం కంపెనీ స్టూడియోకు వెళ్లి ఇలా రెండు వర్గాల ప్రజలలో కలకలం సష్టించే ఈ సినిమాను ప్రదర్శించినందుకు 24 గంటల్లో హైదరాబాదును వదిలి కలకత్తాకు వెళ్ళిపోవాల్సిందిగా ఆదేశించాడు. ఆ వెంటనే హైదరాబాదు స్టేట్‌ స్టేట్‌ లో ప్రదర్శించే సైలెంట్‌ సినిమాలను తిరిగి సెన్సార్‌ చేసి ప్రదర్శించాలని నిజాం ఉత్తర్వులు జారీ చేశాడు. నిజానికి మార్చి 1924 మార్చిలో లో బాంబే సెన్సార్‌ బోర్డు ఆమోదించిన రజియా బేగం ప్రదర్శనలను పంజాబ్‌, ఢిల్లీ, యునైటెడ్‌ ప్రావిన్స్‌లు, బీహార్‌, ఒరిస్సాలు కూడా ‘అనైతిక’ కారణాలతో సెన్సార్‌ ధవీకరణ నిరాకరించాయి.
ఇలా హైదరాబాదులో సెన్సారింగ్‌ కు సంబంధించిన అధికారిక కార్యక్రమాలు 1924లో మొదలైనప్పటికీ ఇందుకు బీజాలు 1922 లోనే పడిన విషయం చరిత్రలో తెరమరుగుననే ఉండిపోయింది. పోతే బ్రిటిష్‌ ఇండియాలో 1918లో ఇండియన్‌ సినిమాటోగ్రఫీ చట్టం ఏర్పడింది. దీని ద్వారా 1920లో దేశం మొత్తాన్ని ఆరు జోన్లుగా విభజించారు. అవి బొంబాయి, బెంగాల్‌, మద్రాస్‌, పంజాబ్‌, రంగూన్‌, వాయువ్య భారత ప్రాంతాలు. హైదరాబాదులో ప్రదర్శితమయ్యే సైలెంట్‌ చిత్రాలలో చాలా మటుకు బొంబాయిలో సెన్సారై వచ్చేవి.

నిజానికి ఏడవ నిజాం మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌
ధీరేన్‌ గంగూలీని కలకత్తా నుండి పిలిపించి మూకీల నిర్మాణానికి పూర్తి సహాయ సహకారాలు అందించారు. ఇది జరిగింది 1922లో. ధీరేన్‌ త్వరలోనే నిజాం వద్ద సమ్మకాన్ని పొంది సినిమా నిర్మాణానికి కావలసిన వసతులను సమకూర్చుకున్నాడు. ఇంతేగాక షూటింగుల నిమిత్తం తన సొంత ఉద్యానవనాలను, భవంతులను కూడా వాడుకునే వసతి కల్పించాడు నిజాం. ధీరేన్‌ పరపతితో జె.ఎఫ్‌.మదన్‌ కూడా హైదరాబాదులో రెండు సినిమా థియేటర్లు కూడా కట్టేశాడు.
ధీరేన్‌ గంగూలీ హైదరాబాదులో ఉన్న కాలంలోనే నిజాం స్టేట్‌ ఫిలిం సెన్సారింగ్‌ ఏర్పాటు చేశాడు ఏడవ నిజాం మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌. హైదరాబాదులో ప్రదర్శించే మూకీల్లో చాలామటుకు బొంబాయి, కలకత్తా, పూనా, షోలాపూర్‌ తదితర ప్రాంతాల్లో తయారైనవే ఉండేవి. మరికొన్ని విదేశీ మూకీలు ప్రదర్శితమయ్యేవి. ప్రధానంగా విదేశీ మూకీలలో చుంబన దశ్యాలు, నత్య దశ్యాలపట్ల హైదరాబాదులో ఒక వర్గం వారి నుండి అభ్యంతరాలు వచ్చినవి. అట్లా మొదటిసారి అభ్యంతరాలకు గురైన మూకీ సినిమా ”పతిభక్తి” (1922). కలకత్తాకు చెందిన మదన్‌ థియేటర్స్‌ వారు నిర్మించిన ఈ సినిమా అలనాటి అందాల నటి పెషన్స్‌ కూపర్‌, ఎం.మోహన్‌ ప్రధాన పాత్రధారులు. అట్లానే హైదరాబాదులో ప్రదర్శనకు అనుమతి లభించని రెండో సినిమా ”హీర్‌ రాంఝా” (1929). సైలంట్‌ స్టార్‌ గా ఎదిగిన రూబీమేయర్‌ సులోచన ఈ సినిమా నాయిక. ఈ రెండు సినిమాల్లో ముద్దు పెట్టుకునే దశ్యాలున్నవి. బ్రిటిష్‌ వారి సంస్కతిలో ఇది తప్పు కాదు. కానీ హైదరాబాదు సంస్కతి దీనికి అంగీకరించదు. హైదరాబాదీ ప్రేక్షకులు వీటిని చూశాక అభ్యంతరాలు వ్యక్తం చేశారు.
రజియా బేగం ఉదంతం తర్వాత ఏడవ నిజాం మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌ తన సలహాదారులకు ఈ విషయమై విచారణ జరపమని ఉత్తర్వులు ఇచ్చాడు. వారు సమావేశమై పోలీస్‌ కమీషనర్‌ చైర్మన్‌ గా ఒక హిందూ ఇన్స్పెక్టర్‌, ఒక ముస్లిం ఇన్స్పెక్టర్‌ సభ్యులుగా సెన్సార్బోర్డు ఏర్పడి సినిమా ప్రదర్శనకు ముందే అభ్యంతరమైన అంశాలేమైనా ఉంటే వెంటనే ప్రభుత్వానికి నివేదించేలా నిర్ణయం జరిగింది.

రజియా బేగం సినిమాను నిషేధించడం మరియు ధీరేన్‌ గంగూలీని హైదరాబాదును విడిచి వెళ్ళమనడం
ఒకరకంగా ఇది హైదరాబాదులో సినీరంగానికి, దాని పురోభివద్దికి తొలిరోజుల్లో కలిగిన తీవ్రమైన విఘాతం. పోతే ఈ ‘రజియాబేగం’ మూకీ ప్రదర్శించబడిన లోటస్‌
థియేటర్‌ 50మంది కూర్చుని చూడగలిగే వసతిని కలిగి ఉండేది. పైగా రెండవ అంతస్తులో ఉండి సినిమా అనుకూలంగా మార్చబడింది. ఇది ఆబిడ్స్‌ గన్బౌండ్రి రోడ్లో ఉండేది. ఆ తరువాత ఈ థియేటర్‌ లైట్‌ హౌజ్‌ పేరుతో నడిచింది. 1980 చివర్లో మూతపడింది. కానీ థియేటర్‌ రూపులోని ఆనవాళ్లు ఇప్పటికీ ఉన్నవి.
కాగా, ధీరేన్‌ గంగూలీ కాలంలో రజియాబేగం (1924) నిషేధానికి గురైనట్టుగా మహవీర్‌ ఫోటో ప్లేస్‌ సంస్థ 1930లో నిర్మించిన ‘ఎ ప్రిన్స్‌ ఆఫ్‌ ది పీపుల్‌’ (రాజధర్మ) సినిమాను బ్రిటీష్‌ ఇండియాలో నిషేదించారు. ఈ చిత్రం ప్రభుత్వంపై తిరుగుబాటు ధోరణితో కూడిన కథాంశంతో తయారైంది. స్వాతంత్య్ర పోరాటం, తిరుగుబాటు ధోరణి కనిపిస్తుందీ చిత్రంలో. ఇది చూసిన బ్రిటీష్‌ సర్కార్‌ ఈ చిత్రాన్ని నిషేధించింది. ఈ నిషేధం హైదరాబాదు స్టేట్లో కూడా కొంతకాలం అమలులో ఉండింది.
పోతే, ఆ తర్వాత కాలంలో ఈ సెన్సార్‌ బోర్డులోని సభ్యులు సినిమా చూశాక కమిషనర్‌ వాటిని తొలగించాక గానీ ప్రదర్శనలకు అనుమతిచ్చేవారు కాదు. ఈ విధానం కొంతకాలం కొనసాగాక ‘సెన్సార్బోర్డులోని సభ్యులుగా ప్రజా సమూహం నుండి కూడా కొందరిని చేర్చడం గమనించవలసిన విషయం. అయితే బ్రిటీష్‌ సైనికుల ఆధీనంలో ఉన్న సికిందరాబాదులో మాత్రం ఎలాంటి సెన్సారింగ్‌ ఆంక్షలు లేకుండానే మూకీల ప్రదర్శనలు జరిగేవి. ఇట్లా 1924 లోనే హైదరాబాదులో సెన్సార్‌ షిప్‌ మొదలైంది.

– హెచ్‌ రమేష్‌ బాబు, 7780736386

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -