Sunday, December 14, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంఘోర రోడ్డు ప్రమాదం

ఘోర రోడ్డు ప్రమాదం

- Advertisement -

ఒకే కుటుంబంలో నలుగురు మృతి
ఓటు వేయడానికెళ్తుండగా ఘటన
పెద్ద శంకరంపేట మండల పరిధిలో విషాదం

నవతెలంగాణ-పెద్ద శంకరంపేట
ఓటు వేయడానికి స్వగ్రామానికి వెళ్తూ రోడ్డు ప్రమాదంలో కుటుంబం మొత్తం ప్రాణం కోల్పోయింది. నలుగురు అక్కడికక్కడే మృతిచెందారు. ఈ ఘటన మెదక్‌ జిల్లా పెద్ద శంకరంపేట మండలం పరిధిలో నాందేడ్‌-హైదరాబాద్‌ 161వ జాతీయ రహదారిపై శనివారం జరిగింది. వివరాలిలా ఉన్నాయి.. కామారెడ్డి జిల్లా నిజాంసాగర్‌ మండలం, మాగి గ్రామానికి చెందిన కూర్మ లింగయ్య(45) తన భార్య కూర్మ సాయవ్వ(40), కొడుకు సాయిలు(18), కూతురు మానసతో కలిసి బైక్‌పై హైదరాబాద్‌ నుంచి స్వగ్రామానికి వెళ్తున్నారు. ఈ క్రమంలో పెద్ద శంకరంపేట కింగ్స్‌ 9 దాబా వద్దకు చేరుకోగానే, గుర్తు తెలియని వాహనం వేగంగా వచ్చి బైక్‌ను ఢకొీట్టింది. ప్రమాదంలో నలుగురు తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే ప్రాణం కోల్పోయారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం జోగిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -