నవతెలంగాణ – ఆర్మూర్
పట్టణంలోని ప్రభుత్వ బాలికల పాఠశాలలో 1976.. 77 సంవత్సరం చదువుకున్న పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం సంబరంగ నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థులంతా ఏకమై ఆనందంగా ఒకరినొకరు అలింగనం చేసుకున్నారు. అనంతరం ఉత్సాహంగా క్రీడలు ఆడి,తీపి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. అంకాపూర్ లాలన వృద్ధాశ్రమంలో వృద్ధులకు పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. వృద్ధులతో కలిసి ఆనందంగా గడిపారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. 50 సంవత్సరాల తర్వాత తామంతా ఏకమై కలుసుకోవడం ఆనందంగా ఉందని, వాట్సప్ గ్రూప్ క్రియేట్ చేసుకుని అందరి నంబర్లు సంపాదించి చివరకు తామంతా కలిసి ఆత్మీయ సమ్మేలాన్ని నిర్వహించుకోవడం జరిగిందని అన్నారు. అమెరికాతో పాటు, హైదరాబాద్ వివిధ ప్రాంతాల్లో స్థిరపడ్డ వారు సైతం ఆత్మీయ సమ్మేళనానికి రావడం హర్షించదగ్గ విషయమని, భవిష్యత్తులో తామంతా కలిసే ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు వనజ,పూర్వ విద్యార్థుల సువర్ణ, గంగామణి, విద్యారాణి, సులోచన, హేమలత, ఉమా, రమీల, లక్ష్మి, వనజ, సరోజా, తదితరులు పాల్గొన్నారు.



