కాంగ్రెస్ ప్రజా పలనలోనే గ్రామాల అభివృద్ధి
ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి
నవతెలంగాణ-పాలకుర్తి
గ్రామాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకునేందుకు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ లను ప్రజలు అధిక మెజారిటీతో గెలిపించుకోవాలని ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం మండలంలోని చెన్నూరు, లక్ష్మీనారాయణ పురం, శాతాపురం, గోపాలపురం, గూడూరు, కిష్టాపురం తండా, రాగవపురం, అయ్యంగారిపల్లి, పెద్ద తండా కె, బమ్మెర గ్రామాల్లో గ్రామపంచాయతీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న యశస్విని రెడ్డిని ఆయా గ్రామాల ప్రజలు డప్పు వాయిద్యాలతో ఆటపాటలతో ఘనంగా స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రజా పాలనలోనే గ్రామాలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతాయని అన్నారు. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులను గెలిపించుకుంటేనే గ్రామాలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతాయని అన్నారు. మండలంలో పెండింగ్లో ఉన్న అభివృద్ధి పనులను పూర్తి చేస్తానని మరోసారి ఇచ్చారు. పాలకుర్తి చెన్నూరు రిజర్వాయర్లను సకాలంలో పూర్తిచేసి చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందించేందుకు ప్రణాళికను రూపొందించుకున్నామని తెలిపారు. అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేసి ఆదుకుంటామని తెలిపారు.
రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడిన అనతి కాలంలోనే మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం, రైతులకు రెండు లక్షల రుణమాఫీ, సన్నధాన్యం పండించిన రైతులకు క్వింటాలకు 500 బోనస్, గృహ అవసరాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకాలను అందించామని, అర్హులైన మహిళలందరికీ ఇందిరమ్మ చీరలతో పాటు డ్వాక్రా మహిళలందరినీ కోటీశ్వరులుగా తీర్చిదిద్దేందుకు ప్రజా ప్రభుత్వం ఇతని నిశ్చయంతో ఉందని తెలిపారు. గ్రామాలను అభివృద్ధి చేసుకునేందుకు నమస్కారాలు ప్రజలు కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించుకొని అభివృద్ధికి బాటలు వేసుకోవాలని సూచించారు. ప్రతిపక్ష పార్టీల మాయమాటలను నమ్మి ప్రజలు మోసపోవద్దని కోరారు.
ప్రతిపక్షాలకు ఓటు వేస్తే బూడిదలో పోసిన పన్నీరేనని, అభివృద్ధిని ఆకాంక్షించే పార్టీలకు ఓటు వేసి గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ పాలనకు మొదటి, రెండో విడత పంచాయతీ ఎన్నికల ఫలితాలే ఆదర్శమన్నారు. ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను జీర్ణించుకోలేకనే ప్రతిపక్షాలు దిగజారుడు విమర్శలు చేస్తున్నాయని ఆరోపించారు. పది లక్షల ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాపాక సత్యనారాయణ, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు గిరగాని కుమారస్వామి గౌడ్, కొడకండ్ల మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఎర్రబెల్లి రాఘవరావులతోపాటు ఆయా గ్రామాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

