Tuesday, December 16, 2025
E-PAPER
Homeసినిమాభిన్న ప్రేమకథతో 'ఇట్లు అర్జున'

భిన్న ప్రేమకథతో ‘ఇట్లు అర్జున’

- Advertisement -

వాట్‌ నెక్స్ట్‌ ఎంటర్టైన్మెంట్స్‌ తన తొలి ప్రొడక్షన్‌ను ‘ఇట్లు అర్జున’తో ప్రారంభించింది. సక్సెస్‌ ఫుల్‌ దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించిన వెంకీ కుడుముల కంటెంట్‌ బేస్డ్‌ కథలను ప్రోత్సహించాలనే లక్ష్యంతో నిర్మాతగా కొత్త జర్నీని ప్రారంభించారు. నూతన దర్శకుడు మహేష్‌ ఉప్పల దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అనిష్‌ను హీరోగా పరిచయం చేస్తున్నారు. అనస్వర రాజన్‌ హీరోయిన్‌. తాజాగా విడుదలైన ‘సోల్‌ ఆఫ్‌ అర్జున’ ఈ మూవీ వరల్డ్‌ని అద్భుతంగా ప్రజెంట్‌ చేసింది. ఈ గ్లింప్స్‌ నాగార్జున అందించిన మ్యాజికల్‌ వాయిస్‌ ఓవర్‌తో ప్రశాంతంగా, కవిత్వాత్మకంగా ప్రారంభమవుతుంది.

ప్రేమ స్వచ్ఛత, లోతును ఆయన మాటలు గొప్ప ఆవిష్కరిస్తాయి. ఆ వర్ణనలోనే అర్జున పరిచయమౌతాడు. అర్జున మాట్లాడలేడు, కానీ నిశ్శబ్దం అతనిని బలహీనపరచదు, అతని భావోద్వేగాలను తగ్గించదు. అతని ధైర్యం, బలం ఈ టీజర్‌లో ప్రజెంట్‌ చేసిన తీరు ఆకట్టుకుంది. డెబ్యూ హీరోగా అనీష్‌ ఆకట్టుకునే నటన కనబరిచాడు. ఫిట్‌గా, కాన్ఫిడెంట్‌గా కనిపించాడు. డైలాగ్స్‌కు ఆస్కారం తక్కువగా ఉండే పాత్రలో భావ వ్యక్తీకరణ, బాడీ లాంగ్వేజ్‌తోనే కథను మోయడం ప్రశంసనీయం. కళ్లలో కనిపించే ఇంటెన్సిటీ అతన్ని పూర్తి హీరో మెటీరియల్‌గా నిలబెడతాయి. సాహసో పేతమైన జంప్స్‌, రా ఫిజికాలిటీతో కూడిన యాక్షన్‌ షాట్స్‌ గొప్ప యీజ్‌తో చేశాడు.

అనస్వర రాజన్‌ ఫ్రేమ్‌కు తాజాదనాన్ని తీసుకొస్తుంది. లీడ్‌ పెయిర్‌ మధ్య కెమిస్ట్రీ సహజంగా అనిపిస్తూ, గ్లింప్స్‌లోనే కథ భావోద్వేగాన్ని ప్రేక్షకుల హదయానికి చేరువ చేస్తుంది. నాగార్జున మ్యాజికల్‌ వాయిస్‌ ఓవర్‌ ఈ గ్లింప్స్‌కు మెయిన్‌ హైలైట్‌గా నిలిచింది. సరికొత్త కాన్సెప్ట్‌, ఆకట్టుకునే కంటెంట్‌, సోల్‌ ఫుల్‌ మ్యూజిక్‌, అద్భుతమైన డెబ్యూ పెర్ఫార్మెన్స్‌తో ఇట్లు అర్జున గ్రేట్‌ సినిమాటిక్‌ ఎక్స్‌పీరియన్స్‌ ఇస్తోంది. ఈ సక్సెస్‌ఫుల్‌ గ్లింప్స్‌ సినిమాపై ఉన్న క్యురియాసిటీని మరింతగా పెంచింది అని చిత్ర యూనిట్‌ తెలిపింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -