ప్రభాస్, డైరెక్టర్ మారుతి, హౌస్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కాంబినేషన్‌లో రూపొందుతున్న మూవీ ‘రాజా సాబ్’. ఈ సినిమా నుంచి సెకండ్ సింగిల్ ‘సహన సహన..’ అప్డేట్ వచ్చేసింది.
ఈ బ్యూటీఫుల్ మెలొడీ సాంగ్ ప్రోమోను ఆదివారం రిలీజ్ చేశారు. ‘సహన సహన..’ ఫుల్ లిరికల్ సాంగ్‌ను ఈ నెల 17న సాయంత్రం 6.35 నిమిషాలకు రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ సాంగ్‌లో ప్రభాస్ కలర్‌ఫుల్ ట్రెడిషనల్ కాస్ట్యూమ్స్‌తో ఆల్ట్రా స్టైలిష్ వైబ్ క్రియేట్ చేస్తున్నారు. ఈ సాంగ్‌ను మ్యూజిక్ సెన్సేషన్ తమన్ తన కెరీర్ బెస్ట్ మెలొడీగా కంపోజ్ చేశారు. ప్రభాస్, నిధి అగర్వాల్‌పై చిత్రీకరించిన ఈ పాటలోని స్టన్నింగ్ లొకేషన్స్ హైలైట్‌గా నిలుస్తున్నాయి.
సంక్రాంతి సందడిని రెట్టింపు చేసేందుకు జనవరి 9న ఈ సినిమా వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు రెడీ అవుతోంది. హర్రర్ కామెడీ జోనర్‌లో ఎవర్ గ్రీన్ మూవీగా నిలిచిపోయేలా దీన్ని తెరకెక్కిస్తున్నారు దర్శకుడు మారుతి. ఈ సినిమాను భారీ ప్రొడక్షన్ వ్యాల్యూస్‌తో అన్ కాంప్రమైజ్డ్‌గా నిర్మిస్తున్నారు నిర్మాతలు టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్. మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ ఈ చిత్రంలో హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ఈ సినిమా రిలీజ్ కోసం రెబల్ స్టార్ ఫ్యాన్స్‌తో పాటు వరల్డ్ వైడ్ ఆడియెన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రానికి ఎడిటింగ్ – కోటగిరి వెంకటేశ్వరరావు, సినిమాటోగ్రఫీ – కార్తీక్ పళని, మ్యూజిక్ – తమన్, ప్రొడక్షన్ డిజైనర్ – రాజీవన్.
అందమైన మెలొడీగా ‘సహన సహన..’
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



