– అడవులపై బుల్డోజర్లు ప్రయోగిస్తోంది
– ప్రకృతి, జంతువులను ప్రమాదంలో పడేసేలా చర్యలు : రేవంత్ ప్రభుత్వంపై ౖ పీఎం మోడీ విమర్శలు
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ సర్కార్ ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించి, అడవులపై బుల్డోజర్ ను ప్రయోగించడంలో నిమగమైందని ప్రధాని మోడీ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ప్రకృతిని నాశనం చేయడం, జంతువులను ప్రమాదంలో పడేసేలా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది కాంగ్రెస్ పార్టీ అసలైన కార్యశైలీ అని ఆరోపణలు గుప్పించారు. హర్యానాలో చెత్త నుంచి గోవర్థన్ గిరీ తయారు చేసేందుకు కృషి చేస్తుంటే, తెలంగాణలోని కాంగ్రెస్ సర్కార్ అడవిని నాశనం చేస్తోందన్నారు. సోమవారం హర్యానాలోని హిసార్ ఎయిర్ పోర్ట్, ఇతర ప్రాజెక్ట్ లను ప్రధాని మోడీ ప్రారంభించారు. అనంతరం యమునా నగర్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ ర్యాలీలో ఆయన ప్రసంగించారు. ఈ సందర్బంగా కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు చేశారు. హర్యానాలో మూడో సారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలను పూర్తిగా అమలు చేస్తున్నట్లు చెప్పారు. అయితే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలైన తెలంగాణ, కర్నాటక, హిమాచల్ ప్రదేశ్‌లో అక్కడి ప్రభుత్వాలు ప్రజల విశ్వాస ఘాతుకానికి పాల్పడుతున్నాయన్నారు. ‘కాంగ్రెస్ అధికారంలో ఉన్న హిమాచల్ ప్రదేశ్ లో అభివృద్ధి, సంక్షేమం అటకెక్కింది. కర్నాటకలో కరెంట్ నుంచి పాల దాకా… బస్సు చార్జీల నుంచి విత్తనాలకు వరకు ప్రతిదాని రేట్లు పెరిగాయి. కర్నాటకలో పెరుగుతోన్న నిత్యవసర ధరలను వివరించేలా ‘ఏ నుంచి జెడ్’ అక్షరాలతో కూడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఏకంగా కాంగ్రెస్ సీఎం… అవినీతిలో కర్నాటకను దేశంలోనే నెంబర్ వన్ గా నిలిపారు’ అని ఆరోపించారు. ‘పక్కనే ఉన్న తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల హామీలకు ఇచ్చిన హామీలు మరించింది. అడవులపై బుల్డోజర్లు ప్రయోగిస్తోంది. ఈ విధానంతో ప్రకృతి నాశనం అవుతోంది. జంతువులు ప్రమాదంలో పడుతున్నాయి’ అని కామెంట్ చేశారు. ఇలా రెండు రకాల ప్రభుత్వాల మోడల్స్ ప్రజల ముందు ఉన్నాయని చెప్పారు. కాంగ్రెస్ మోడల్ లో… కేవలం అబద్ధాలు నిరూపితమయ్యాయని, వారు కుర్చీ కోసం మాత్రమే ఆలోచిస్తారన్నారు. మరో మోడల్ బీజేపీ అని… కేవలం సత్యం ఆధారంగానే ఈ పార్టీ పాలన చేస్తోందన్నారు. అంబేడ్కదర్ సూచించిన దిశలో పరిపాలిస్తున్నట్టు వెల్లడించారు. రాజ్యాంగ గౌరవాన్ని పెంపొందించేలా ముందుకు వెళ్తోందన్నారు. వికసిత్ భారత్ చేసే కలను సాకారం చేసేందుకు కృషి చేస్తున్నట్టు చెప్పారు.
ఇచ్చిన హామీలు మరిచిన తెలంగాణ సర్కార్
- Advertisement -
RELATED ARTICLES