Monday, May 19, 2025
Homeతెలంగాణ రౌండప్పట్టణంలో నిర్వహించే  అభివృద్ధి పనులను వేగంగా చెయ్యాలి..

పట్టణంలో నిర్వహించే  అభివృద్ధి పనులను వేగంగా చెయ్యాలి..

- Advertisement -

నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 
పట్టణంలో నిర్వహించే అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేయాలని పిసిసి కార్యదర్శి పోత్నక్ ప్రమోద్ కుమార్ సోమవారం జిల్లా కలెక్టర్ హనుమంతరావుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భువనగిరి పట్టణంలో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే స్థానిక ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి  నేతృత్వంలో పట్టణంలో పలు అభివృద్ధి పనులను పరిశీలించామని, అ పనులను పూర్తి చేయడంలో సంబంధిత కాంట్రాక్టర్లు సంబంధిత అధికారులు నిర్లక్ష్య వైఖరిని వల్ల కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వానికి విమర్శలకు గురై ప్రజలు అవస్థలకు గురవుతున్నారని అన్నారు.  ప్రజలలో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వానికి చెడ్డపేరు వచ్చే విధంగా పట్టణ అభివృద్ధి పనుల విషయంలో డబల్ బెడ్ రూమ్ లు ప్రభుత్వ సొమ్మంతా దుర్వినియోగంకి గురవుతున్నాయని,  నిర్మించిన డబల్ బెడ్ రూమ్ లోని అన్నిటిని ఆకతాయిలో పూర్తిగా విధాంసం చేస్తున్నారని  అధికారులకు పట్టింపు  లేకుండా ఉందన్నారు. 

భువనగిరి పట్టణంలో చరిత్రమైన  రహదారి బంగ్లా దానికి  తెలంగాణ రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి  కోమటిరెడ్డి వెంకటరెడ్డి  నూతనంగా మంత్రి పదవి బాధ్యతలు చేపట్టగానే  భువనగిరి రహదారి బంగ్లా మరమతుల కొరకు 10 లక్షల  రూపాయలను మంజూరు చేయడం జరిగిందనారు కాంట్రాక్టర్ పనులను పూర్తి చేయకుండా సగంలోని ఆపివేసి రహదారి బంగ్లాకు తాళం వేయడంతో అధికారుల నిర్లక్ష్యానికి ఇదే నిదర్శనం అని అన్నారు.  ఇంటిగ్రేటెడ్ మార్కెట్ పనులను వెంటనే పూర్తి చేసి రోడ్లపై చిరు వ్యాపారం చేస్తున్న చిరు వ్యాపారస్తులకు ఇంటిగ్రేటెడ్ మార్కెట్ యార్డ్ లోకి తీసుకొని వచ్చి వాళ్లకు ఉపాధి కల్పిస్తూ రహదారిపై ట్రాఫిక్ అంతరాయం తొలగిపోయే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. బొమ్మయిపళ్లి శిధిల వ్యవస్థలో ఉన్న ఎస్సీ కమిటీ హాల్ భవనాన్ని హౌసింగ్ బోర్డ్ కాలనీలోని హై టెన్షన్ వైర్లను ఇందిరానగర్ లోని ఇరుకైన గల్లీలలో సిసి రోడ్లు మురికి కాలువలు నిర్మాణం చేసి ప్రజలలో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ పై నమ్మకం వచ్చే విధంగా పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి పనులను సంబంధిత కాంట్రాక్టర్లతో సంబంధిత అధికారులతో  వెంటనే పూర్తి చేయించాలని  కోరినట్లు తెలిపారు.  ఈ కార్యక్రమంలో పట్టణ యూత్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు పడిగెల ప్రదీప్, ఈరపాక నరసింహ, పిట్టల బాలరాజ్, దాసరి మధు, బట్టు మహేందర్, సిరిపంగ శివలింగం, ఇటుకల దేవేందర్ లు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -