Tuesday, December 16, 2025
E-PAPER
- Advertisement -

అయిదు కొత్త స్క్రీన్స్ ను చేర్చిన PVR INOX, హైదరాబాద్ ఇన్ఆర్బిట్ మాల్ లో 11- స్క్రీన్ సూపర్ ప్లెక్స్ ఆవిష్కరణ

నవతెలంగాణ హైదరాబాద్: PVR INOX లిమిటెడ్, భారతదేశపు అతి పెద్ద సినిమా ఎగ్జిబిషన్ కంపెనీ సైబరాబాద్ లోని తమ ఇన్ ఆర్బిట్ మాల్ విస్తరణను హైదరాబాద్ మొదటి సూపర్ ప్లెక్స్ గా ప్రకటించింది. ఇప్పటికే ఉన్న ఆరింటికి అయిదు కొత్తగా చేర్చబడిన స్క్రీన్స్ తో, సినిమా ఇప్పుడు ఒకే చోట 11 స్క్రీన్స్ ను అందిస్తోంది. నగరంలోనే అత్యధిక సంఖ్య గల ఆడిటోరియంస్ ఉన్న సినిమాగా నిలిచింది.

సూపర్ ప్లెక్స్ 3 ప్రీమియం ఫార్మాట్స్ – Luxe, PXL, , 4DXని కలిగి ఉంది. ప్రధానమైన స్క్రీన్స్ తో పాటు ఇవి, 11 స్క్రీన్ ఏర్పాటుకు ఒకే చోట చేరి స్పష్టమైన దృశ్యాలు, స్థిరమైన సౌండ్, అనుకూలమైన సౌకర్యాలను యువ ప్రేక్షకులు, కుటుంబాలకు,ఉద్యోగాలు చేసే నిపుణులకు అందిస్తున్నాయి.

తెలంగాణలో మొదటి PXL 55 అడుగుల – వెడల్పు స్క్రీన్, RGB లేజర్ ప్రొజెక్షన్, డాల్బీ అట్మోస్ సౌండ్ , రిక్లైనర్ సీటింగ్ ను కలిగి ఉంది. మూడుLuxe స్క్రీన్స్ సున్నితమైన రిక్లైనర్లు, ఆహ్లాదకరమైన ఇంటీరియర్లు, , ఇన్-హౌస్ చెఫ్ తయారు చేసే మెనూ అందిస్తున్నాయి. నగరంలో మూడవది అయిన 4DX స్క్రీన్ హైదరాబాద్ లో వీక్షణ అనుభవానికి మోషన్ సీట్స్ , గాలి, పొగ, సెంట్, నీరు, మంచు వంటి ఎఫెక్ట్స్ ను అందిస్తోంది. ఈ ఫార్మాట్స్ 11-స్క్రీన్ సూపర్ ప్లెక్స్ ను రూపొందించడానికి ఇప్పటికే ఉన్న ఆరింటిని కలిపిన అయిదు కొత్తగా చేర్చబడిన స్క్రీన్స్ లో భాగంగా ఉన్నాయి. ఈ సినిమా ప్రదేశం ఆకర్షణీయమైన, యువత కేంద్రీయమైన రూపం, లేత ఆకుపచ్చ రంగులు, డిజిటల్, స్టాటిక్ ఆర్ట్ వర్క్, విశ్రాంతదాయకమైన సీటింగ్ ను కలిగి ఉంది. Luxe లౌంజ్ లో కూర్పు చేసిన ఫర్నిచర్, ఓపెన్ కిచెన్, పూల్ బల్ల వంటి ఏర్పాట్లతో ప్రశాంతంగా విశ్రాంతి తీసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది.

11 స్క్రీన్స్ లో, 210 PXL సీట్లు, 107 Luxe సీట్లు, 104 4DX సీట్లు, 947 ప్రధానమైన సీట్లు సహాసూపర్ ప్లెక్స్ లో 1368 సీట్లు ఉన్నాయి.

PVR INOX లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ అజయ్ బిజ్లీ “ఇన్ఆర్బిట్ మాల్ లోని సూపర్ ప్లెక్స్ హైదరాబాద్ లోని మా ఉనికి కోసం ఒక ముఖ్యమైన చర్యగా సూచించింది. 11 స్క్రీన్స్, మూడు ప్రీమియం ఫార్మాట్స్ తో, నగరంలో విస్తృత శ్రేణి వ్యూయింగ్ ఎంపికల్లో అత్యంత చురుకైన వినోదాత్మకమైన వేదికల్లో ఒకటి అందించే లక్ష్యాన్ని కలిగి ఉన్నాము. అతిథులు అందరి కోసం సౌకర్యం, స్పష్టత , నమ్మకమైన టెక్నాలజీని అందించే పెద్ద స్థలాలపై మేము దృష్టి కేంద్రీకరించాము”అన్నారు.

PVR INOX లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సంజీవ్ కుమార్ బిజ్లీ మాట్లాడుతూ “ఈ ఆస్థి ఆధునిక ప్రేక్షకులకు సేవలు అందించడానికి సినిమాస్ ను నిర్మించడానికి మా విధానాన్ని సూచిస్తోంది. Luxe, PXL, 4DXల మిశ్రమం , ప్రధానమైన స్క్రీన్స్ హైదరాబాద్ ప్రేక్షకులకు ఒకే ప్రదేశంలో శక్తివంతమైన ఎంపికను అందిస్తున్నాయి. మేము ఈ సూపర్ ప్లెక్స్ ను నగరానికి తీసుకురావడానికి ఆనందిస్తున్నాము”అన్నారు. ఈ ప్రారంభంతో, PVR INOX దక్షిణ భారతదేశంలో తమ ఉనికిని శక్తివంతం చేసింది , సైబరాబాద్ లో తాజా ల్యాండ్ మార్క్ ను చేర్చింది. సూపర్ ప్లెక్స్ నగరంలోని ఫిల్మ్ ప్రేమికుల కోసం స్థాయి, ప్రీమియం ఫార్మాట్స్, ఆలోచనాత్మకమైన డిజైన్ , సాదరమైన ఆతిథ్యాన్ని తెచ్చింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -