Saturday, January 10, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఆరు స్వదేశీ యూఏవీ రక్షణ ఉత్పత్తుల ఆవిష్కరణ

ఆరు స్వదేశీ యూఏవీ రక్షణ ఉత్పత్తుల ఆవిష్కరణ

- Advertisement -

రఘువంశీ భారత రక్షణ సామర్థ్యాల విస్తరణ

హైదరాబాద్‌ : భారతదేశ రక్షణ తయారీ పర్యావరణ వ్యవస్థకు పటిష్ఠ ప్రోత్సాహకంగా కొత్త డీప్‌టెక్‌ డిజైన్‌, ఉత్పత్తి, ఇంటిగ్రేషన్‌ కేంద్రాన్ని ప్రారంభించినట్లు రఘు వంశీ ఏరోస్పేస్‌ తెలిపింది. అదే విధంగా పూర్తిగా భారతదేశంలో అభివృద్ధి చేసిన ఆరు స్వదేశీ యూఏవీ, అటానమస్‌ రక్షణ ఉత్పత్తులను సోమవారం ఆవిష్కరించింది. కొత్త తయారీ, సాంకేతిక అభివృద్ధిలో రూ.100 కోట్లకు పైగా పెట్టుబడి మద్దతుతో, మానవ రహిత, తదుపరి తరం రక్షణ వ్యవస్థలలో భారతదేశ స్వావలంబన కోసం జరుగుతున్న ప్రయత్నాల్లో ఇవి భాగమని రఘు వంశీ ఏరోస్పేస్‌ గ్రూప్‌ వ్యవస్థాపకులు, ఎండీ వంశీ వికాస్‌ తెలిపారు.

ప్రస్తుతం తాము మూడు దేశాలలో 10 తయారీ కేంద్రాలు, 1,000 కంటే ఎక్కువ మంది ఉద్యోగులతో గ్లోబల్‌ ఓఈఎంలు, భారతీయ డీఎస్‌యూల కోసం ఏరో ఇంజిన్లు, క్షిపణి ఉపవ్యవస్థలను సరఫరా చేస్తోన్నామన్నారు. తమ సంస్థ హైదరాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలోని హార్డ్‌వేర్‌ పార్క్‌లో కొత్తగా సిటాడెల్‌ క్యాంపస్‌ను ప్రకటించిందని వెల్లడించారు. డిజైన్‌, సిస్టమ్‌ ఇంటిగ్రేషన్‌, అసెంబ్లీ, టెస్టింగ్‌ కోసం పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేశామన్నారు. స్వదేశీ ప్రతిభను ఉపయోగించుకుని, తదుపరి యుద్ధ యుగానికి ప్రపంచవ్యాప్తంగా ప్రమాణంగా చేయబడిన, ఇంజనీరింగ్‌ చేయబడిన వ్యవస్థలను తాము అభివృద్ధి చేస్తున్నామన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -