Monday, May 19, 2025
Homeతెలంగాణ రౌండప్ఆన్లైన్ బెట్టింగ్ ఊబిలో చిక్కకుండా పిల్లల ప్రవర్తనను గమనించండి: సీఐ శ్రీనివాస్ 

ఆన్లైన్ బెట్టింగ్ ఊబిలో చిక్కకుండా పిల్లల ప్రవర్తనను గమనించండి: సీఐ శ్రీనివాస్ 

- Advertisement -

నవతెలంగాణ – దుబ్బాక 
వేసవి సెలవుల్లో ఆన్లైన్ యాప్ లు, బెట్టింగ్ ల  ద్వారా పెద్ద మొత్తంలో డబ్బులు పోగొట్టుకొని చివరికి ప్రాణాలు తీసుకునే వరకు వస్తుందని, తమ పిల్లల ప్రవర్తనను ప్రతి తల్లిదండ్రులు గమనించాలని సీఐ పీ.శ్రీనివాస్ అన్నారు. సోమవారం దుబ్బాక లోని సర్కిల్ ఆఫీస్ లో ఆయన మాట్లాడారు. వేసవి సెలవుల్లో కాలువలు, చెరువుల్లో ఈత కొట్టేందుకు వెళ్లి ప్రమాదాల బారిన పడతారని, తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. డ్రగ్స్ నిరోధానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని, అందుకు ప్రజలందరూ సహకరించాలని కోరారు. డీజే బాక్సులతో శబ్ద తీవ్రత ఎక్కువ అవుతుందని త్వరలోనే వారితో ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేస్తామని హెచ్చరించారు. రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ పాటించాలన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -