Sunday, January 11, 2026
E-PAPER
Homeక్రైమ్రోడ్డు ప్రమాదంలో ఎంబీబీఎస్‌ విద్యార్థిని మృతి

రోడ్డు ప్రమాదంలో ఎంబీబీఎస్‌ విద్యార్థిని మృతి

- Advertisement -

– తండ్రి కండ్లెదుటే తీవ్ర గాయాలతో ప్రాణం కోల్పోయిన కూతురు
నవతెలంగాణ-హయత్‌ నగర్‌

ఇంటి నుంచి కాలేజీకి వెళ్లేందుకు తండ్రితో కలిసి రోడ్డు దాటుతుండగా అతి వేగంగా వచ్చిన కారు ఢకొీనడంతో ఎంబీబీఎస్‌ విద్యార్థిని అక్కడికక్కడే మృతిచెందింది. ఈ విషాద ఘటన హైదరాబాద్‌ హయత్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో సోమవారం జరిగింది. ఇన్‌స్పెక్టర్‌ నాగరాజు గౌడ్‌ తెలిపిన వివరాల ప్రకారం.. మెదక్‌ జిల్లా కౌడిపల్లి మండలం చిట్కూల గ్రామానికి చెందిన యంసాని పాండు 30 ఏండ్ల కిందట హైదరాబాద్‌కు వచ్చాడు. ప్రస్తుతం హయత్‌నగర్‌లోని వినాయక నగర్‌ కాలనీలో భార్య, పిల్లలతో కలిసి నివాసం ఉంటున్నాడు. అతను ఓ ట్రాన్స్‌పోర్ట్‌ కంపెనీలో పనిచేస్తూ ఇద్దరు పిల్లలను చదివిస్తున్నాడు. కుమారుడు విదేశాల్లో చదువుతుండగా, కూతురు ఐశ్వర్య(19) మహబూబ్‌నగర్‌లో ఎంబీబీఎస్‌ ద్వితీయ సంవత్సరం చదువుతోంది.ఇటీవల ఇంటికి వచ్చిన ఐశ్వర్య సోమవారం కాలేజీకి వెళ్లేం దుకు తండ్రితో కలిసి ఆర్టీసీ కాలనీ నుంచి నడుచుకుంటూ వచ్చింది. రోడ్డు దాటుతుండగా ఎల్‌బీనగర్‌ నుంచి హయత్‌నగర్‌ వైపు వెళ్తున్న కారు వేగం గా వచ్చిన వారిద్దరిని ఢకొీట్టింది. దాంతో ఐశ్వర్య తలకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మరణించింది. పాండు తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -