ఏడేండ్ల తర్వాత రెండురోజుల పర్యటన
ద్వైపాక్షిక సంబంధాలు ఏర్పడి 75 ఏండ్లు
నేడు జోర్డాన్ రాజుతో చర్చలు
అమాన్: భారత ప్రధాని విదేశీ పర్యటనలో భాగంగా సోమవారం జోర్డాన్‌కు చేరుకున్నారు.పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నా.. రెండు రోజుల పాటు జోర్డాన్ పర్యటకు మోడీ వెళ్లటం గమనార్హం. జోర్డాన్ విమానాశ్రయంలో ప్రధాని మోడీకి ఆ దేశ ప్రధాని జాఫర్ హసన్ సాదరంగా స్వాగతం పలికారు. ఆపై హౌటల్‌కు చేరుకున్న మోడీకి ఎన్నారైలు సైతం ఘన స్వాగతం పలికారు. దీనిలో భాగంగా ప్రవాస భారతీయులతో పాటు భారత సంతతికి చెందిన వారితో మోడీ సమావేశమయ్యారు. పలువురు కళాకారులతో సాంస్కృతిక ప్రదర్శన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ప్రధాని మోడీ జోర్దాన్ పర్యటనలో జోర్డాన్ రాజు అబ్దుల్లాతో హుస్సేనియా ప్యాలెస్‌లో సమావేశం కానున్నారు. జోర్డాన్ రాజు ఆహ్వానం మేరకే ప్రధాని మోడీ.. . ఆ దేశ పర్యటనకు బయల్దేరి వెళ్లారు. .జోర్డాన్ రాజుతో ప్రధాని మోడీ ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొనున్నారు.
ప్రధాని మోదీ జోర్డాన్ పర్యటనతో ఇరుదేశాల మధ్య దౌత్యసంబంధాలు బలపడనున్నాయి. ప్రధాని మోడీ జోర్డాన్ పర్యటనకు వెళ్లడం ఏడేండ్ల తర్వాత ఇదే తొలిసారి. 2018లో జోర్డాన్‌ను సందర్శించిన ప్రధాని మోడీ.. ఆ తర్వాత ఇంతకాలానికి అక్కడకు వెళ్లారు.ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు ఏర్పడి 75 ఏండ్లు కావడం, అదే సమయంలో ఆ దేశ రాజు ఆహ్వానాన్ని పురస్కరించుకుని ప్రధాని మోడీ అక్కడకు వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది. కాగా, ప్రధాని వాస్తవానికి సోమవారం ఉదయం 8:30 గంటలకు బయలుదేరాల్సి ఉండగా, దట్టమైన పొగమంచు కారణంగా ద ృశ్యమానత (విజిబిలిటీ) గణనీయంగా పడిపోవడంతో ఆయన పర్యటనలో ఆలస్యమైనట్టు అధికారవర్గాలు తెలిపాయి.
జోర్డాన్‌లో ప్రధాని మోడీ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



