నవతెలంగాణ – మల్హర్ రావు
గ్రామ ప్రథమ పౌరుడు సర్పంచ్, ప్రజాస్వామ్య వ్యవస్థలో చెక్ పవర్తో పాటు విశేషామైన అధికారులున్నాయి. గ్రామపంచాయతీలో నిర్వహించాల్సిన రిజిస్టర్లు ఇలా ఉన్నాయి. గ్రామపంచాయతీ సమావేశపు ఎజెండా నోటీసు రిజిస్టర్, సభ్యుల హాజరు రిజిస్టర్, మినిట్స్ తీర్మానాల రిజిస్టర్, గ్రామసభ ఎజెండా నోటీను రిజిస్టర్.. గ్రామసభ సభ్యుల హాజరు రిజిస్టర్, గ్రామసభ తీర్మానాలు-మినిట్స్ నగదు పుస్తకం (క్యాష్బుక్).
ఇంటి పన్ను డిమాండ్ రిజిస్టర్, నెలవారీ నల్లా రుసుం డిమాండ్ రిజిస్టర్, వ్యాపార లైసెన్సు రిజిస్టర్, గృహ నిర్మాణాల అనుమతుల రిజిస్టర్, ఆదాయం వచ్చు ఆస్తుల రిజిస్టర్, చెల్లింపులకై బిల్లులు పాస్ చేసిన రిజిస్టర్, చిల్లర పాటల రిజిస్టర్, ధర్మాదాయాల, ధర్మనిధుల రిజిస్టర్, అక్విటెన్సు రిజిస్టర్, ఆడిట్ రిజిస్టర్, డీసీబీ రిజిస్టర్, స్టాక్ రిజిస్టర్, టూల్స్ అండ్ ప్లాంట్స్ రిజిస్టర్, మనీ వాల్యు రిజిస్టర్ ఇలా ఉంటాయి. నూతనంగా ఎన్నికైన సర్పంచ్ లు,వార్డు సభ్యులు మొదట తెలుసుకోవలసింది ఇవే.



