Sunday, January 11, 2026
E-PAPER
Homeఆదిలాబాద్42 శాతం బీసీ రిజర్వేషన్లతో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించాలి

42 శాతం బీసీ రిజర్వేషన్లతో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించాలి

- Advertisement -

నవతెలంగాణ – జన్నారం
బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించి ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించాలని బీసీ కులాల ఐక్య ఉద్యమ పోరాట సమితి ఉమ్మడి జిల్లా కన్వీనర్ చంద్రయ్య కోరారు. మంగళవారం జన్నారంలో ఆయన మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించలేకపోయారని గుర్తు చేశారు. బీసీలకు న్యాయం జరగాలంటే తప్పనిసరిగా 42 శాతం రిజర్వేషన్ ఉండాలని, ఆ రిజర్వేషన్ అమలుచేసి ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు జరపాలన్నారు. లేకుంటే బీసీ సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. బీసీ సంఘ నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -