Wednesday, December 17, 2025
E-PAPER
Homeకరీంనగర్మహా పాదయాత్ర బృందానికి ఘన స్వాగతం

మహా పాదయాత్ర బృందానికి ఘన స్వాగతం

- Advertisement -

నవతెలంగాణ రాజన్న సిరిసిల్ల
రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన హరిహరపుత్ర అయ్యప్ప స్వాములు మహా పాదయాత్రలో భాగంగా శబరిమలైకి నడుచుకుంటూ వెళ్లి తిరిగి వచ్చిన అయ్యప్ప స్వాములకు సిరిసిల్లలోని ఎర్రం శంకర్ గురుస్వామి ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. ప్రయాకర్ రావు మధు ఆధ్వర్యంలో అనేకమంది మహాపాదయాత్ర ద్వారా శబరిమలకు వెళ్లి మొక్కులు తీర్చుకున్నారు. దిగ్విజయంగా వారి యాత్ర పూర్తి కావడంతో వారిని ఘనంగా సన్మానించారు. సన్మానోత్సవ కార్యక్రమంలో ఎర్రం మల్లయ్య, కల్లూరి మధు, ప్రవీణ్ నెల్లుట్ల, కనకయ్య, స్వామి, మనోహర్, చైతన్య, వేణు, లక్ష్మణ్, వినయ్, భరత్, అశోక్, సాయి, సుధాకర్, ప్రకాష్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -