Wednesday, December 17, 2025
E-PAPER
Homeజిల్లాలుమండలంలో పోలింగ్ ఏర్పాట్లు పూర్తి

మండలంలో పోలింగ్ ఏర్పాట్లు పూర్తి

- Advertisement -

– మండలంలో విధులు నిర్వర్తించనున్న 416మంది సిబ్బంది
నవతెలంగాణ-కమ్మర్ పల్లి 
మండలంలో మూడో విడతలో భాగంగా బుధవారం జరగనున్న గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మండలంలో 14 గ్రామ పంచాయతీలు, 138 వార్డులు ఉన్నాయి. వీటిలో దొమ్మరి చౌడు తండా గ్రామ పంచాయతీ సర్పంచ్ తో పాటు వార్డు సభ్యులు ఏకగ్రీవమయ్యారు. మిగిలిన 13 గ్రామ పంచాయతీల్లో పోలింగ్ జరగనుంది. అదేవిధంగా మండలంలోని 138 వార్డులకు గాను 36 వార్డులు ఏకగ్రీవం కాగా మిగిలిన 102 వార్డులో పోలింగ్ నిర్వహించనున్నారు.

సిబ్బందికి పోలింగ్ సామాగ్రి పంపిణీ….
మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయం వద్ద బుధవారం ఏర్పాటు చేసిన ప్రత్యేక డిస్ట్రిబ్యూషన్ కేంద్రంలో ఆయా గ్రామాల్లో గ్రామ పంచాయితీ  ఎన్నికల సందర్భంగా పోలింగ్ విధులు నిర్వర్తించే సిబ్బందికి సామాగ్రి పంపిణీ చేశారు. సిబ్బంది వారి వారికి కేటాయించిన ప్రత్యేక వాహనాల్లో ఎన్నికల సామాగ్రితో పోలీస్ బందోబస్తు మధ్య గ్రామాలకు తరలి వెళ్లారు.

ఎన్నికల విధుల్లో 416మంది సిబ్బంది….
మండలంలో బుధవారం జరగనున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 416మంది సిబ్బంది పోలింగ్ విధులు నిర్వహించనున్నారు. వీరిలో రిటర్నింగ్ అధికారులు 13 మంది, పోలింగ్ అధికారులు 132 మంది, అసిస్టెంట్ పోలింగ్ అధికారులు 271మంది ఉన్నారు. అంతేకాకుండా ప్రతి గ్రామంలో ఎన్నికల కోసం రిజర్వ్ సిబ్బందిని కూడా ఏర్పాటు చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -