ఓడిన అభ్యర్థి సుధాకర్ నాయక్ ఆరోపణ..
న్యాయం చేయాలని కలెక్టర్ కార్యాలయంలో ఎంపీడీవోకు వినతులు
నవతెలంగాణ – డిచ్ పల్లి
ఈనెల 14న జరిగిన రెండో విడత స్థానిక సర్పంచ్ ఎన్నికల సందర్భంగా ఇందల్ వాయి మండలంలోని రూప్లానాయక్ తాండాలో జరిగిన ఓటింగ్ సమయంలో ఆక్రమాలు రిగ్గింగ్ చోటు చేసుకుందని తనకు న్యాయం చేయాలని ఓడిపోయిన అభ్యర్థి బాదవత్ సుధాకర్ నాయక్ పేర్కొన్నారు.
మంగళవారం ఆయన విలేకరులకు వివరాలను వెల్లడించారు.14 న జరిగిన ఎన్నికల్లో రూప్లా నాయక్ తాండ నుండి ముగ్గురు సర్పంచ్ స్థానం కోసం పోటీ పడ్డామని, తాండలో మొత్తం 758 ఓట్లకు గాను 478 ఓట్లు పోలయ్యాయని, దానిలో బాదవత్ హరి సింగ్ కు 233, సుధాకర్ నాయక్ 230 ,సావిత్రికి 15ఓట్లు వచ్చాయన్నారు. ఓటింగ్ సమయం లో అక్రమాలు జరిగాయని, ఓటు వేసిన వారిలో కొందరు మృత్యువాత చెందారని, ఇంకొందరు గల్ఫ్ కు, ఇతర చోట్ల వెళ్లిన వారి ఓట్లు వేసినట్లు గుర్తించామన్నారు. వారు ఓటింగ్కు రాకుండా వారి ఓట్లను వేసినట్లు ఆయన తెలిపారు.
ఇదే విషయమై సోమవారం కలెక్టరేట్లో ఫిర్యాదు చేశానని, ఇదే కాకుండా మండల పరిషత్ అభివృద్ధి అధికారికి రాతపూర్వకంగా ఎన్నికల సందర్భంగా జరిగిన ఆక్రమాలపై ఫిర్యాదు చేసినట్లు ఆయన వివరించారు. పూర్తిస్థాయిలో విచారణ చేసి తనకు న్యాయం చేయాలని ఇదే విషయమై న్యాయస్థానాన్ని ఆశ్రయించనున్న ట్లు సుధాకర్ నాయక్ వెల్లడించారు.



