Tuesday, May 20, 2025
Homeతెలంగాణ రౌండప్పుచ్చలపల్లి సుందరయ్య ఆశయాలను కొనసాగిస్తాం 

పుచ్చలపల్లి సుందరయ్య ఆశయాలను కొనసాగిస్తాం 

- Advertisement -
  • – సీపీఐ(ఎం) జిల్లా కార్యవర్గ సభ్యులు దేశ్యా నాయక్ 
    నవతెలంగాణ – అచ్చంపేట
    : పుచ్చలపల్లి సుందరయ్య ఆశయాలను కొనసాగిస్తామని సీపీఐ(ఎం) జిల్లా కార్యవర్గ సభ్యులు దేశ్యా నాయక్ అన్నారు. పట్టణంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య గారి 40వ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి  వర్ధం  సైదుల్ అధ్యక్షతన వహించారు. సుందరయ్య చిత్రపటానికి గింజల మార్కెట్ హమాలి అధ్యక్షుడు లక్ష్మయ్య పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. 
  •  ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నెల్లూరు జిల్లాలోని అలాగానిపాడు లో జన్మించిన కామ్రేడ్స్ సుందరయ్య భూస్వామ్య కుటుంబంలో జన్మించి ఉన్న భూమిని పేదలకు పంచి నిరాడంబరంగా తన యొక్క జీవితాన్ని పేద ప్రజల కోసం పోరాటం చేసిన గొప్ప యోధుడు కామ్రేడ్ సుందరయ్య అని కొనియాడారు. 20 ఏళ్ల పాటు పార్లమెంటు అసెంబ్లీలలో నిరంతరం ప్రజలన సమస్యల పైన భారతదేశ అభివృద్ధి పైన అనర్గళంగా మాట్లాడితే రాజకీయ పార్టీలకు అతీతంగా నెహ్రూ లాంటి వ్యక్తులే ప్రశంసించిన గొప్ప వ్యక్తి అని వారు అన్నారు ప్రస్తుతం దేశంలో కేంద్ర  ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తుందని వాటికి వ్యతిరేకంగా ప్రజలను చైతన్యవంతం చేసి ఎర్రజెండా పార్టీల ఆధ్వర్యంలో పోరాటాలు నిర్వహించాలని ప్రజలకు భారత రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాసే ప్రయత్నం నరేంద్ర మోడీ ప్రభుత్వం చేస్తుందని వాటికి వ్యతిరేకంగా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. వ్యవసాయ రంగంలో నూతన వ్యవసాయ చట్టాలను తీసుకువచ్చి రైతుకు భూమి లేకుండా చేయాలని కుట్ర మోడీ ప్రభుత్వం చేస్తుందని వాటికి వ్యతిరేకంగా పోరాటం చేయాలన్నారు. అనేక సంవత్సరాల నుంచి పోరాటం చేసి సాధించుకున్న కార్మిక చట్టాలను రద్దుచేసి నాలుగు లేబర్ కోళ్లు తీసుకువచ్చి కార్మికుల హక్కులను కాలరాసే ప్రయత్నం చేస్తుందని స్వతంత్ర కాలంలో సాధించుకున్న హక్కులను కాపాడుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ నేతలు జంగయ్య రాములు శివకుమార్ గింజల మార్కెట్ కార్యదర్శి రేణు గౌడ్ వెంకటయ్య రవి నాయక్ తులసి రామ్ లచ్చిరాం పాండు రాజు బీమ్ల లక్ష్మణ్ కార్మికులు తదితరులు పాల్గొన్నారు 
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -