ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి..
నవతెలంగాణ – ఆలేరు
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ జనాభా అవసరాలకు అనుగుణంగా వేగవంతమైన రైలు రవాణా వ్యవస్థను ఏర్పాటు చేయాలని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కోరారు. ఢిల్లీలో మంగళవారం నాడు అర్బన్ అఫైర్స్ మంత్రిత్వ శాఖ స్థాయి కమిటీ సమావేశం జరిగింది.ఈ సమావేశంలో పాల్గొని ఆయన మాట్లాడుతూ హైదరాబాద్ చుట్టూ ఉన్న 8 జిల్లాలలో ప్రాంతీయ వేగవంతమైన రైలు రవాణా వ్యవస్థ. (ఆర్. ఆర్. టి. సి) ఏర్పాటు చేసినట్లయితే. మరింత నివాస యోగ్యంగా హైదరాబాద్ నగరం మారుతుందన్నారు.తద్వారా స్థిరమైన అభివృద్ధి ఉపాధి అవకాశాలు పెరుగుతాయి అన్నారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. మెట్రో ఫేజ్ 2 వంటి కీలకమైన ప్రతిపాదనలు కేంద్రానికి పంపి అనుమతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎదురుచూస్తుందన్నారు.పెండింగ్లో మెట్రో పనులకు కేంద్ర ప్రభుత్వం వెంటనే అనుమతులు ఇవ్వాలని కోరారు.8 జిల్లాలో పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు పాటు పెరగడంతో పాటు. అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందుతాయి అని కమిటీలో వివరించారు.
హైదరాబాద్ చుట్టూ వేగవంతమైన రైలు రవాణా వ్యవస్థ ఏర్పాటు చేయాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



