Wednesday, December 17, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఆక్స్ ఫర్డ్ పాఠశాలలో చేతిరాత శిక్షణా శిబిరం

ఆక్స్ ఫర్డ్ పాఠశాలలో చేతిరాత శిక్షణా శిబిరం

- Advertisement -

నవతెలంగాణ – ఆర్మూర్
పట్టణ శివారులో గల గాంధీ నగర్ లోని ఆక్స్ ఫర్డ్ పాఠశాలలో చేతిరాత శిక్షణ శిబిరాన్ని ప్రారంభించడం జరిగిందని ఈ శిబిరం 10 రోజులపాటు కొనసాగుతుందని పాఠశాల కరస్పాండెంట్ మానస గణేష్ మంగళవారం తెలిపారు. శిక్షణ శిబిరానికి బోధకులుగా ప్రముఖ చేతిరాత నిపుణులు డోంగరి రమేష్ హాజరై మాట్లాడుతూ.. అందమైన చేతిరాత తమలో ఆత్మవిశ్వాసాన్ని పెంచి విజయానికి తొలి మెట్టు అవుతుందని ఆయన అన్నారు.

సరైన విధానంలో క్రమమైన అభ్యాసం చేస్తే ప్రతి విద్యార్థి అందంగా రాయగలడని ఆయన అన్నారు. తెలివి ఎక్కువగా ఉన్న విద్యార్థులు తక్కువగా ఉన్న విద్యార్థులు అనే తేడా లేకుండా చేతిరాత ఒక అభ్యాసంతో అభివృద్ధి చెందే నైపుణ్యమని ఆయన అన్నారు. 

 మంచి చేతిరాత వల్ల ఏకాగ్రత ఆత్మవిశ్వాసం ఆలోచన స్పష్టత పెరుగుతాయని ఆయన వివరించారు. అలాగే చేతిరాత సాధన ద్వారా మెదడు సమన్వయం జ్ఞాపకశక్తి సహనం పెరుగుతాయని వాటితో పాటు పరీక్షల్లో మంచి మార్కులు సాధించేందుకు దోహదపడుతుందని ఆయన తెలిపారు. విద్యార్థులు రాసేటప్పుడు కూర్చునే విధానము పెన్ను పట్టుకునే తీరు అక్షరాల మధ్య అంతరం అక్షర నిర్మాణం పై దృష్టి పెట్టె విధానంపై మెలకువలను నేర్పించారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్  మాట్లాడుతూ విద్యార్థుల సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా ఇలాంటి నైపుణ్యాలు అభివృద్ధి చెందే కార్యక్రమాలు పాఠశాలలలో నిరంతరంగా చేపడుతామని ఆయన అన్నారు. ఈ చేతిరాత శిబిరం 10 రోజుల పాటు కొనసాగుతుందని ఆయన తెలిపారు. కార్యక్రమంలో పాఠశాల పాలనాధికారిని పద్మ ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -