Wednesday, December 17, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కాంగ్రెస్ లోకి భారీగా చేరికలు 

కాంగ్రెస్ లోకి భారీగా చేరికలు 

- Advertisement -

నవతెలంగాణసదాశివపేట
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై సదాశివపేట మండలంలోని అంకెనపల్లి గ్రామానికి చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు బీఆర్‌ఎస్, బీజేపీ పార్టీలను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. మంగళవారం సంగారెడ్డిలో టీజీఐఐసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో వీరంతా కాంగ్రెస్‌లో చేరారు.

ఈ సందర్భంగా నిర్మల జగ్గారెడ్డి గారు కొత్తగా పార్టీలో చేరిన వారికి కాంగ్రెస్ కండువాలు కప్పి ఆహ్వానించారు. కార్యక్రమంలో సీడీసీ చైర్మన్ రాంరెడ్డి , సదాశివపేట మండల కాంగ్రెస్ అధ్యక్షులు సిద్ధన్న పాల్గొన్నారు.అంకెనపల్లి గ్రామానికి చెందిన వీరన్న, చంద్రప్ప, బీరప్ప, మల్లేశం, సంగన్న, మహేష్, రమేష్, సురేష్ తదితరులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న ప్రజా సంక్షేమ కార్యక్రమాలు గ్రామీణ ప్రజల్లో విశేష ఆదరణ పొందుతున్నాయని, అందుకే ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్ వైపు వలసలు పెరుగుతున్నాయని ఈ సందర్భంగా నేతలు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -