సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు యండి జహంగీర్
నవతెలంగాణ – భువనగిరి
నూతనంగా ఎన్నికైన సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులు తమ పదవిని గ్రామ సమగ్రాభివృద్ధికై పోరాట ఆయుధంగా మార్చాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు యండి జహంగీర్ సూచించారు. మంగళవారం స్థానిక సుందరయ్య భవన్ లో భువనగిరి మండలంలో నూతనంగా ఎన్నికైన సీపీఐ(ఎం)కు చెందిన చీమలకొండూర్ సర్పంచ్ పల్లెర్ల అంజయ్య, అనాజిపురం సర్పంచ్ రాయపురం సురేష్, వార్డు సభ్యులు ఏదునూరి కళ్యాణి, నోముల జ్యోతి, ఆకుల హేమలత లను సీపీఐ(ఎం) పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా శాలువాలతో సన్మానం చేసి అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా జహంగీర్ పాల్గొని మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా సీపీఐ(ఎం) అభ్యర్థులకు ఓటు వేసిన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నామని తెలిపారు. సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో నిర్వహించిన కూలీ, భూమి, ఉపాధి, సంఘటిత, ఆ సంఘటిత కార్మికుల సమస్యల పైన, రైతుల సమస్యల పైన, వ్యవసాయ కార్మికుల సమస్యలపై, ప్రజల సమస్యల పైన, పాలకులు అవలంబిస్తున్న విధానాల పైన నిర్వహించిన పోరాటాలను గుర్తించి ప్రజలు జిల్లా వ్యాప్తంగా సర్పంచులుగా, ఉప సర్పంచ్ గా, వార్డు సభ్యులుగా సీపీఐ(ఎం) అభ్యర్థులను గెలిపించారని అన్నారు. గెలిచిన ప్రజా ప్రతినిధులు ప్రజల భాగస్వామ్యంతో గ్రామాలు అన్ని రంగాలలో అభివృద్ధి అయ్యేవిధంగా కృషి చేయాలని కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా గ్రామాల అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించి ప్రణాళికల అమలు కోసం, అభివృద్ధి కోసం తగిన నిధులు గ్రామపంచాయతీలకు కేటాయించి విడుదల చేయాలని సూచించినారు.
ప్రధానంగా గ్రామాలలో రోడ్లు, విద్యుత్తు, వీధి లైట్లు, డ్రైనేజీ, మంచినీరు లాంటి మౌలిక సమస్యలపై కేంద్రీకరణ ఎక్కువ ఉండాలని అన్నారు. ఇంకా గ్రామాలలో ఇండ్లు, ఇళ్ల స్థలాలు, పెన్షన్లు, రేషన్ కార్డు లాంటి సమస్యలు ప్రజలు ఎదుర్కొంటున్నారని వాటిని కూడా పరిష్కరించే విధంగా ప్రజాప్రతినిధులు పనిచేయాలని జహంగీర్ సూచించినారు. ఈ కార్యక్రమానికి సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ్మ అధ్యక్షత వహించగా సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు మాటూరి బాలరాజు, కల్లూరి మల్లేశం, దాసరి పాండు, జిల్లా కమిటీ సభ్యులు దయ్యాల నర్సింహ, పార్టీ సీనియర్ నాయకులు గద్దె నర్సింహ, మండల కార్యదర్శివర్గ సభ్యులు ఎదునూరి మల్లేశం, అన్నం పట్ల కృష్ణ, కొండమడుగు నాగమణి, అనాజిపురం మాజీ సర్పంచులు బొల్లెపల్లి కుమార్, గునుగుంట్ల కల్పన, ఏదునూరి ప్రేమలత, సీపీఐ(ఎం) సీనియర్ నాయకులు గునుగుంట్ల శ్రీనివాస్, కొలుపుల వివేకానంద మండల కమిటీ సభ్యులు కొండపురం యాదగిరి, అనాజిపురం శాఖ కార్యదర్శి ఏదునూరి వెంకటేష్, చీమల కొండూరు శాఖ కార్యదర్శి బోడ అంజనేయులు, నాయకులు దయ్యాల మల్లేష్, కొత్తపల్లి పద్మ , రాంబాబు పాల్గొన్నారు.



