నవతెలంగాణ – ఆర్మూర్
మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లి నలంద హై స్కూల్ విద్యార్థులు RMM (రామన్ మ్యాథ్స్ మహోత్సవ్) –ఐఐటి పరీక్షలో అత్యుత్తమ ప్రతిభను కనబరిచారని పాఠశాల కరస్పాండెంట్ లక్కారం రాజేంద్ర ప్రసాద్, ప్రిన్సిపాల్ లక్కారం సాగర్ లు మంగళవారం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఈ పరీక్షలో వారు రాష్ట్ర స్థాయిలో అగ్రస్థానంలో నిలిచి, పాఠశాలకు గొప్ప గౌరవాన్ని తేచ్చిపెట్టిందని అన్నారు. రాష్ట్ర స్థాయి 1వ ర్యాంక్: శ్రీ మహాలక్ష్మి – 4వ తరగతి శివమణి శంకర్ – 6వ తరగతి , రాష్ట్ర స్థాయి 4వ ర్యాంక్కె. నితిష – 8వ తరగతి పి. నితిష – 8వ తరగతి అని తెలిపారు.
రాష్ట్ర స్థాయి 5వ ర్యాంక్:సాక్షిత – 5వ తరగతి కె. రుషిక – 7వ తరగతి పి. హరిణి – 8వ తరగతి హృద్య శ్రీ – 8వ తరగతి నహిద – 8వ తరగతి అశ్విత – 8వ తరగతి అబ్దుల్ అర్హాన్ – 8వ తరగతి శ్రీకర్ – 8వ తరగతి అని తెలిపారు. నలంద హైస్కూల్ యాజమాన్యం , సిబ్బంది అంకితభావం, అద్భుతమైన విజయానికి అన్ని విజేతలకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. విద్యా నైపుణ్యాన్ని పెంపొందించడంలో ఉపాధ్యాయుల నిబద్ధతతో కూడిన కృషిని మరియు తల్లిదండ్రుల నిరంతర మద్దతును కూడా పాఠశాల అభినందిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ,విద్యార్థులు పాల్గొన్నారు.



