Sunday, January 11, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సర్పంచ్ ప్రమాణ స్వీకార మహోత్సవానికి ముస్తాబవుతున్న జీపీ

సర్పంచ్ ప్రమాణ స్వీకార మహోత్సవానికి ముస్తాబవుతున్న జీపీ

- Advertisement -

ఈనెల 20న సర్పంచ్ , వార్డు సభ్యుల ప్రమాణ స్వీకారానికి గ్రామ ప్రజలు హాజరవ్వాలి.. 
మునుగోడు గ్రామపంచాయతీ కార్యదర్శి రాజశేఖర్ రెడ్డి..
నవతెలంగాణ- మునుగోడు

ఈనెల 11న మొదటి విడత సర్పంచ్ ఎన్నికలలో గెలుపొందిన సర్పంచ్ వార్డు నెంబర్లు ఈనెల 20 న చేపట్టే ప్రమాణ స్వీకార మహోత్సవానికి మునుగోడు గ్రామపంచాయతీ కార్యాలయానికి మంగళవారం జీపీ కార్యదర్శి రాజశేఖర్ రెడ్డి రంగులు వేయిస్తూ ముస్తాబు చేస్తున్నారు. పాలకవర్గం సమావేశ మందిరంలో నూతన కుర్చీల ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. ఈనెల 20 న నూతన సర్పంచిగా ప్రమాణస్వీకారం చేయనున్న పాలకూరి రమాదేవి నరసింహ తోపాటు 14 మంది వార్డు సభ్యులు చేపట్టే ప్రమాణ స్వీకార మహోత్సవానికి  గ్రామంలోని ప్రజలందరూ అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని ఆయన కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -