భారత్-జోర్డాన్‌ల మధ్య వాణిజ్య ఒప్పందం
ప్రతిపాదించిన ప్రధాని
మోడీని మ్యూజియంకు తీసుకెళ్లిన క్రౌన్ ప్రిన్స్
అమ్మాన్: వచ్చే ఐదేండ్లలో రూ.500 కోట్ల మేర భారత్-జోర్డాన్‌ల మధ్య వాణిజ్య ఒప్పందాలకు ప్రధాని నరేంద్ర మోడీ ప్రతిపాదించారు. ఇరుదేశాల మధ్య స్నేహపూరిత వాతావరణం కొనసాగాలని ఆయన అభిప్రాయపడ్డారు. జోర్డాన్ క్రౌన్ ప్రిన్స్ అల్ హుస్సేన్ బిన్ అబ్దుల్లా -2 మంగళవారం ప్రధాని మోడీని స్వయంగా జోర్డాన్ మ్యూజియంకు తీసుకెళ్లారు. మ్యూజియంలో జోర్డాన్ చరిత్ర, సంస్కృతి యొక్క విభిన్న అంశాలను వివరించారు. ఈ సందర్భంగా ”అల్-హుస్సేన్‌కు ”కృతజ్ఞుడిని”. ఆయనతో ‘విస్తృతంగా సంభాషించాను. జోర్డాన్ పురోగతి పట్ల ఆయనకున్న మక్కువ స్పష్టంగా కనిపిస్తుంది’ అని ప్రధాని మోడీ సోషల్ మీడియా పోస్ట్‌లో తెలిపారు.
”యువత అభివృద్ధి, క్రీడలు, అంతరిక్షం, ఆవిష్కరణ, వికలాంగుల సంక్షేమం వంటి రంగాలకు క్రౌన్ ప్రిన్స్ చేసిన కృషి నిజంగా గొప్పది” అని మోడీ అన్నారు. జోర్డాన్ వృద్ధి పథాన్ని బలోపేతం చేయడానికి అల్-హుస్సేన్ తన ప్రయత్నాల్లో ఉండాలని కోరుకుంటున్నానని అన్నారు. జోర్డాన్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు , భారతదేశ ఆర్థిక శక్తిని కలిపి దక్షిణాసియా , పశ్చిమాసియాలే కాదు అంతకు మించి ఆర్థిక కారిడార్‌ను సృష్టించవచ్చని రాజు అబ్దుల్లా-2 అభిప్రాయాన్ని వ్యక్తపర్చారు .డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఐటీ, ఫిన్‌టెక్, హెల్త్-టెక్ , అగ్రి-టెక్ రంగాలలో భారతదేశం-జోర్డాన్ వ్యాపార సహకారానికి ఉన్న అవకాశాలను మోడీ హైలైట్ చేశారు ఈ రంగాల అభివృద్ధికి పరస్పరం సహకరించుకోవాలని ఇరు దేశాల స్టార్టప్‌లను ఆహ్వానించారు.
ప్రధాని మోడీకి ఇథియోపియా ఘనస్వాగతం
భారత్,ఇథియోపియా మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత ముందుకు వెళ్తుందని ప్రధాని మోడీ అన్నారు. భవిష్యత్‌తో ఇరుదేశాల మధ్య ఆర్థిక, సాంకేతిక, రక్షణ, ఆరోగ్య, ఆవిష్కరణ, సామర్థ్య నిర్మాణంతోపాటు బహుపాక్షిక సహకారం మరింత వృద్ధి చెందుతుందని అన్నారు. ఇది కోసం స్పష్టమైన ప్రణాళిక సిద్ధం చేస్తామని చెప్పారు. పర్యటనలో భాగంగా భారత్, ఇథియోపియాల మధ్య కస్టమ్స్, డేటా సెంటర్ ఏర్పాటు, యూఎన్ శాంతి పరిరక్షణలో సహకారం లాంటి అంశాలపై 3 అవగాహన ఒప్పందాలు సంతకాలు జరిగాయి.



