- Advertisement -
నవతెలంగాణ – ఆత్మకూరు
నవతెలంగాణ – ఆత్మకూరు: హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలంలో పోలింగ్ సజావుగా కొనసాగుతోంది. మండలంలోని హౌజుబుజుర్గు గ్రామానికి చెందిన 75 ఏళ్ల వృద్ధురాలు షేక్ కమల్ బి ఓటు హక్కు వినియోగంలో తన ధృడ సంకల్పాన్ని చాటారు. మంచానికి పరిమితమైన ఆమె పంచాయతీ సిబ్బంది సహకారంతో వీల్‌చైర్‌పై పోలింగ్ కేంద్రానికి వచ్చి తన ఓటు హక్కును వినియోగించారు.ఆమె ఉత్సాహం ఇతర ఓటర్లకు స్ఫూర్తిగా నిలిచింది.
వృద్ధురాలి ఓటు హక్కుపై చూపిన చైతన్యం చూసి పోలింగ్ కేంద్రంలో ఉన్న వారు ప్రశంసలు కురిపించారు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటు విలువైనదని ఆమె చూపించిన ఈ ఉదాహరణ స్థానికుల్లో సందేశాత్మకంగా మారింది.
- Advertisement -



