నవతెలంగాణ హైదరాబాద్: కల్వకుర్తి మండల పరిధిలోని యంగంపల్లి గ్రామంలో రెండు పర్యాయాలు ఉత్కంఠంగా సాగిన పోరులో నాడు భార్య నేడు భర్తకి సర్పంచ్ పదవులు వరించాయి. 2019 గ్రామపంచాయతీ ఎన్నికల్లో జనరల్ మహిళ రిజర్వ్ కావడంతో గ్రామానికి చెందిన శ్వేత యాదగిరి రెడ్డి బిఆర్ఎస్ పార్టీ మద్దతుతో గ్రామ సర్పంచ్ గా ఎన్నికయ్యారు.
2025 మొదటి విడత ఎన్నికల్లో కల్వకుర్తి మండలం యంగంపల్లి గ్రామం జనరల్ రిజర్వ్ కావడంతో యాదగిరి రెడ్డి (రాజు) బిఆర్ఎస్ పార్టీ తరఫున సర్పంచ్ గా పోటీ చేసి 17 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.
మొదట మా సతీమణి శ్వేత సర్పంచ్ గా గ్రామాన్ని ఎంతో అభివృద్ధి చేశామని అభివృద్ధిని చూసి గ్రామ ప్రజలు రెండోసారి మాకు అవకాశం కల్పించడం ఎంతో సంతోషమని యాదగిరి రెడ్డి అన్నారు. గ్రామ ప్రజల సహకారంతో గ్రామాన్ని మరింత అభివృద్ధి చేస్తానని ఆయన అన్నారు. రాష్ట్రంలోనే ఉత్తమ గ్రామపచాయతీగా తీర్చిదిద్దరమే నా ముందున్న లక్ష్యమని ఆయన తెలిపారు.



