- Advertisement -
నవతెలంగాణ – ఆర్మూర్
పట్టణంలోని మిని స్టేడియం నందు ఎస్ జి ఎఫ్ ఐ యు/19 బాలికల ఉమ్మడి జిల్లాల హాకీ సెలక్షన్స్ బుధవారం నిర్వహించడం జరిగింది. మంచి ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను ఎంపిక చేసి ఈనెల అనగా డిసెంబర్ 20 వ తేదీన రంగారెడ్డి జిల్లాలోని, సరూర్నగర్ లో జరగబోయే రాష్ట్రస్థాయి అంతర్ కళాశాలల పోటీలకు ఈ యొక్క తుదిజట్టు పాల్గొంటుందని జిల్లా హాకీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి సదమస్తుల రమణ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫిజికల్ డైరెక్టర్స్ చిన్నయ్య, అంజు, కాంగ్రెస్ నాయకులు కొంత పూర్ణ ,సీనియర్ హాకీ క్రీడాకారులు కత్తి శీను,వెంకటేష్ పాల్గొన్నారు.
- Advertisement -



