Wednesday, December 17, 2025
E-PAPER
Homeజిల్లాలుఆసియా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు దక్కించుకున్న కామారెడ్డి వాసి

ఆసియా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు దక్కించుకున్న కామారెడ్డి వాసి

- Advertisement -

– తలసేమియా చిన్నారుల కోసం చేస్తున్న రక్తదాన సేవలకు గుర్తింపు
నవతెలంగాణ – కామారెడ్డి

కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్, రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు కు ప్రతిష్టాత్మకమైన ఆసియా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చోటు దక్కించుకోన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ బాలు మాట్లాడుతూ.. తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం 2023 – 24, 2024 – 25 సంవత్సరాలలో మెగా రక్తదాన శిబిరాలు నిర్వహించి ఐదు వేల యూనిట్ల రక్తాన్ని సేకరించినందుకు గాను ఆసియా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు దక్కిందని ఆయన తెలిపారు.  భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా ఈ గుర్తింపు రావడం జరిగిందని, దీనికి సహకరించిన వారందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేశారు. రానున్న రోజుల్లో మరిన్ని రక్తదాన శిబిరాలను తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం నిర్వహిస్తామని అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -