- Advertisement -
– గజ్య నాయక్ తండ సర్పంచ్
నవతెలంగాణ – కామారెడ్డి, మాచారెడ్డి
తనకు ఓట్లు వేసి గెలిపించిన ప్రజల కష్టసుఖాల్లో పాలుపంచుకుంటానని గజ్య నాయక్ తండ సర్పంచ్ రావుల వినోద ప్రభాకర్ అన్నారు. ఈనెల 11న సర్పంచ్ ఎన్నికలు జరగగా గెలుపొందిన మరుసటి రోజు నుండి ఆ గ్రామంలో పర్యటిస్తూ గడపగడపకు వెళ్లి ప్రజల కష్టసుఖాలు తెలుసుకుంటూ వారి సమస్యలను పరిష్కరిస్తానని, మీరు నాపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయనని చెబుతూ ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతూ గ్రామంలో పర్యటిస్తున్నారు. పేదలకు అండగా ఉంటానని, పేదలకు ఏ చిన్న కష్టం వచ్చినా తనకు తెలుపాలన్నారు.
- Advertisement -



