ఎంపీడీవోకు సర్పంచ్ అభ్యర్థుల వినతిపత్రం అందజేత..
నవతెలంగాణ – డిచ్ పల్లి
ఇందల్ వాయి మండల కేంద్రంలోని తిర్మన్ పల్లి గ్రామ పంచాయతీ ఎన్నికల రి కౌంటింగ్ చేయాలని కోరుతూ మండల పరిషత్ అభివృద్ధి అధికారి అనంతరావుకు సర్పంచ్ గా పోటీ చేసిన ఆరుగురు అభ్యర్థులు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ అభ్యర్థులు ధర్పల్లి ప్రభాకర్, మాదం మోహన్, శెట్టి బీరీష్, షేక్ ఇమ్రాన్, అన్నారం శ్రీనివాస్ ,ఇమ్మడి సాయిలు మాట్లాడుతూ.. ఈనెల 14న జరిగిన సర్పంచ్ వార్డు స్థానాలకు పోలింగ్ పూర్తయిన తర్వాత ఒంటిగంట నుండి రెండు గంటల వరకు భోజన సమయంలో పోలింగ్ ఏజెంట్లు భోజనం తెచ్చుకుని లోపల భోజనం చేస్తామని తెలుపగా బలవంతంగా బయట భోజనం చేయాలని వారికి పంపించారని కౌంటింగ్ సమయం రెండు గంటలకు మొదలవుతుందని నోటిసు ఇచ్చి మూడున్నర వరకు మమ్మల్ని కౌంటింగ్ ఎజేంట్ లకు లోనికి అనుమతించలేదని వారన్నారు.
పోలింగ్ పూర్తయిన తర్వాత బ్యాలెట్ బాక్సులు సర్పంచ్ అభ్యర్థుల ముందు సీల్ ఓపెన్ చేయలేదని, కౌంటింగ్ సమయం లో బ్యాలెట్ గుర్తులను చూపించకుండా హడావిడిగా ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభించినట్లు వారు ఆరోపించారు. వెంటనే రిటర్నింగ్ అధికారికి అభ్యంతరం తెలిపి రికౌంటి కోరినట్లు వివరించారు కానీ రిటర్నింగ్ అధికారి నిబంధనల విరుద్ధంగా మా అభ్యర్థులను కోరుచుపుచ్చి సరైన సమాధానం ఇవ్వకుండా ఎన్నికల ఫలితాలను వెల్లడించినట్లు పేర్కొన్నారు. రిటర్నింగ్ అధికారి ప్రవర్తించిన విధానం నిబంధనల విరుద్ధంగా ఉందని ఎన్నికల నియమా నిబంధనలను రిటర్నింగ్ అధికారి ఉల్లంఘించారని అధికారి వెల్లడించిన ఫలితాలు నిలిపివేసి రికార్డింగ్ చేసి న్యాయం చేయాలని వారు విన్నవించారు.



