Wednesday, December 17, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్విద్యార్థులకు మోటివేషన్ క్లాసులు

విద్యార్థులకు మోటివేషన్ క్లాసులు

- Advertisement -

నవతెలంగాణ – సదాశివనగర్
మండలంలోని అడ్లూర్ ఎల్లారెడ్డిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, పీఎం శ్రీ ఆదర్శ పాఠశాల సదాశివనగర్, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సదాశివనగర్ మహాత్మా జ్యోతిబా పూలే కుప్రియాల్ పాఠశాలలలో బంగారు తల్లి ఫౌండేషన్ ఆధ్వర్యంలో మోటివేషన్ క్లాసులు విజయవంతంగా నిర్వహించబడినవి.

ఈ కార్యక్రమంలో ఇంపాక్ట్ ట్రైనర్స్ వజ్జా నవనీత , వజ్జా మహేందర్  మర్రి సదాశివరెడ్డి  విద్యార్థులకు లక్ష్య నిర్ధారణ (Goal Setting), కాల నిర్వహణ (Time Management), వ్యక్తిత్వ వికాసం (Character Building) అంశాలపై ప్రేరణాత్మక శిక్షణా సెషన్లు నిర్వహించారు. ఈ సెషన్లు విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ  లక్ష్య సాధనపై స్పష్టతను పెంపొందించాయని వారు తెలిపారు.

ఈ కార్యక్రమంపై విద్యార్థులు  పాఠశాల ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేస్తూ, ఇది ఎంతో విలువైనదిగా, విద్యార్థుల భవిష్యత్తుకు అత్యంత ఉపయోగకరమైన కార్యక్రమమని పేర్కొని, భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాలు మరింతగా నిర్వహించాలని కోరారు.

కార్యక్రమం అనంతరం ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బంగారు తల్లి ఫౌండేషన్ తరపున మెమెంటోలు అందజేయబడినవి. ఈ కార్యక్రమంలో ఇంపాక్ట్ క్లబ్ ఆఫ్ కామారెడ్డి అధ్యక్షులు మర్రి సదాశివరెడ్డి , బంగారు తల్లి ఫౌండేషన్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్  , ఇంపాక్ట్ ట్రైనర్ వజ్జా నవనీత  వజ్జా మహేందర్  తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -