Tuesday, May 20, 2025
Homeఎడిట్ పేజికాల్పుల విరమణలో సమాధానం లేని సవాళ్లు

కాల్పుల విరమణలో సమాధానం లేని సవాళ్లు

- Advertisement -

సరిహద్దులకు ఇరువైపులా వున్న ప్రజలకు ఉపశమనం లభించింది. భారత్‌ పాకిస్తాన్‌ల మధ్య నాలుగు రోజుల పాటు సాగిన సైనిక సంఘర్షణ మే 10వ తేదీ మధ్యాహ్నానికి ముగింపుకొచ్చింది. అయినా సరే రాత్రి పొద్దుపోయాక కూడా తుపాకీ మోతలు వినిపించాయి. అయితే తర్వాత ఇరు దేశాల డిజిఎంవోలు కాల్పుల విరమణ జరిగిందని ధృవీకరించారు. యుద్ధ మేఘాలు ప్రస్తుతానికి సద్దుమణిగాయని వెల్లడించారు. ఏమైనా ఈ మూడు వారాలు దక్షిణాసియాలో నాటకీయమైన పరిణామక్రమాన్ని ఆవిష్కరించాయి. ఒక వినాశకర పోకడను వెల్లడించాయి. 26 మంది అమాయకులను బలిగొన్న అమానుష హత్యాకాండతో ఈ ఘటనల పరంపర మొదలైంది. అమాయ కులైన ఆ పర్యాటకులను కాపాడేందుకు ప్రాణాలే త్యాగం చేసిన స్థానిక కాశ్మీరీ అశ్వికుడు కూడా వారిలో వున్నాడు. పర్యాటకులనే లక్ష్యంగా చేసుకుని మత విశ్వాసాన్నిబట్టి ఎంపిక చేసుకుని టెర్రరిస్టులు ఈ హత్యాకాండకు పాల్పడ్డారన్నది స్పష్టమే. లష్కరే తోయిబా ఈదాడి వెనక వున్నదనీ, హం తకులతో వారు టెలిఫోన్‌లో మాట్లాడుతున్నారని సైన్యం విడుదల చేసిన స్పష్ట మైన సాక్ష్యాధారాలు చెబుతున్నాయి. అప్పటికీ ఇంకా సందేహా లేమైనా మిగిలివుంటే-వాటికీ ఆస్కారం లేకుండా పాక్‌ పాలక వ్యవస్థ గౌరవ లాంఛనాలు ప్రదర్శించిన టెర్రరిస్టుల చిత్రపటాలు కూడా తర్వాత సాగిన సైనిక చర్యలో లభ్యమైనాయి.
అటు మద్దతు.. ఇటు విద్వేషం..
ఈ విధంగా వాస్తవాలేమిటో నగంగా బయటపడ్డాక శిక్షించే చర్య తీసుకోవడం తప్ప మరో అవకాశమేదీ లేకుండా పోయింది. ఈ ఘటనపై చాలా సహేతుకమైన ఆగ్రహంతో రగిలిపోయిన ప్రజలు ప్రస్ఫుటమైన ఐక్యతతో నిలవడం కనిపించింది. టెర్రరిజంపై చర్య తీసు కోవడానికి దేశంలోని రాజకీయ పార్టీలు ప్రభుత్వానికి మద్దతునిచ్చాయి. అదే సమయంలో అది టెర్రరిస్టులపై చర్యగా తప్ప పూర్థిస్థాయి యుద్ధంగా ఉండరాదని కూడా అత్యంత విశదంగా స్పష్టం చేశాయి. సరిగ్గా ఈ సమయంలోనే కాశ్మీరీలకు, ప్రత్యేకించి ముస్లి ంలకు వ్యతిరేకంగా ఒక విద్వేష ప్రచారం మొదలైంది. చాలాకాలంగా పెంచి పోషించిన విద్వేషయంత్రాంగం రంగంలోకి దిగింది. ముస్లింలు, ఇంకా ఆ మాటకొస్తే పూర్తిస్థాయి యుద్ధం గురించి వ్యతిరేకంగా మాట్లాడిన వారెవరైనా సరే అలాంటి వారందరినీ లక్ష్యంగా చేసుకొని దాడి ప్రారంభమైంది. నిజానికి ఇది చాలా కాలం కిందటే జరగి వుండవలసింది.అయితే సైనిక బలగాలు తమ లక్ష్యం టెర్రరిస్టు యంత్రాంగాన్ని విధ్వంసం చేయడం తప్ప పాకిస్తాన్‌ ప్రజల పైన గాని, పాలక వ్యవస్థ పైన గాని దాడి కాదన్న అంశాన్ని నొక్కి చెప్పేలాగా వ్యవహరించినందుకు ధన్యవాదాలు చెప్పాలి. అందువల్లనే సైనిక బలగాల ప్రతినిధులు మీడియాతో మాట్లాడినప్పుడు వఅత్తిపరంగా తమ లక్ష్యాలను నొక్కిచెబుతూనే మాట్లాడారు. సహజంగా దీనివల్ల విద్వేష ప్రచారకుల కోపం కట్టలు తెంచుకుంది. ప్రభుత్వాన్ని నడిపించే రాజకీయ నాయకత్వం ఈ విద్వేష చర్యల పట్ల నోరు విప్పకపోవడం ఒక ప్రమాదకర లక్షణంగా స్పష్టమైంది. సరిహద్దుకు ఇరువైపులా ఉన్న ప్రజలు సైనిక కార్యకలాపాలు ముగిసిపోవాలని తహతహలాడుతున్నారు. దేశం ఇతర ప్రాంతాల్లోనూ ప్రజలు, సామాన్యులు నష్టపోతున్నారు. పూంచ్‌, రాజౌరి ప్రాంతాల్లోని ప్రజలు దీనివల్ల కడగండ్లపాలయ్యారు. విద్యార్థులు, వలస కార్మికులు అందరి కంటే ఎక్కువగా దెబ్బతిన్నారు. అంతిమంగా పరిస్థితులు చేయిదాటక ముందే కాల్పుల విరమణ అమలు చేయాల్సి వచ్చింది.
పార్లమెంటు చర్చకు నిరాకరణ
సరిగ్గా ఈ సమయంలో అసలు రహస్యం బహిర్గతమైంది. అధికారికంగా ఎలాంటి ప్రకటన రాకముందే అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ తన ప్రభుత్వ మధ్యవర్తిత్వంతో ఇరుపక్షాలు కాల్పుల విరమణకు అంగీకరించాయని ట్వీట్‌ చేశారు. ఇది భారత ప్రభుత్వాన్ని ఇరుకులో పెట్టింది. ప్రత్యేకించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రెండుసార్లు జరిగిన అఖిలపక్ష సమావేశాలకు హాజరు కాకపోవటం ఇందుకు తోడైంది. దీనిపై ప్రభుత్వం చెప్పే కథనం ఒప్పించేదిగా లేదు. ఈ నేపథ్యంలో ఈ మొత్తం పరిణామ క్రమాన్ని పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు జరపి చర్చించాలనే కోర్కె ప్రతిపక్షాల నుంచి వచ్చింది. ఇందుకు ప్రభుత్వం వెనకడుగు వేస్తున్నది. పార్లమెంటు భవనంలో మెట్లకు శిరసాభివందనం చేసి, దాన్ని ప్రజాస్వామ్య దేవాలయంగా అభివర్ణించి, వినయ విధేయతలు ప్రకటించి, ప్రధానిగా ప్రయాణం ప్రారంభించిన నరేంద్ర మోడీ ఇప్పుడు మాట్లాడటం లేదు. ఈ మార్పు ఎందుకు వచ్చిందో తెలియడానికి మనం గత పదేళ్ల చరిత్ర మొత్తంలోకి వెళ్లనవసరం లేదు. అయితే పార్లమెంట్‌ సమావేశాలు జరపాల్సిన ఆవశ్యకత మాత్రం మాసిపోయేది కాదు. ట్రంప్‌ సామ్రాజ్యవాద తరహా ప్రకటన మోడీ ఘన భంగిమలకు తూట్లు పొడిచింది.ఏది ఏమైనా ప్రభుత్వం కదలిక చూపక తప్పని పరిస్థితి ఇది. అయితే ప్రతిపక్షం నుంచి మద్దతు ఉన్నప్పటికీ ప్రభుత్వం పార్లమెంటును ఎదుర్కోవడానికి జంకుతున్నది. కార్యశీల ప్రజాస్వామ్య వ్యవస్థలో ముందుకు వచ్చే ప్రశ్నలకు అవకాశమివ్వడం లేదు.
మళ్లీ దెబ్బతీసిన ట్రంప్‌, పాక్‌కు ఆశీస్సులు
ఈ సమయంలో ఇరకాటం నుంచి బయట పడటానికి ప్రధాని పార్లమెంటును పక్కకు పెట్టి నేరుగా దేశాన్ని ఉద్దేశించి మాట్లాడే మార్గం ఎంచుకున్నారు. అయితే ఆ తర్వాత ప్రధాని ప్రియతమ నేస్తమైన డోనాల్డ్‌ ట్రంప్‌ నుంచే తిరుగులేని ఎదురు దెబ్బ తగిలింది. కాల్పుల విరమణకు దారి తీసిన ఘటనల క్రమాన్ని ఆయన బట్టబయలు చేశారు. సైనిక శత్రుత్వాల తీవ్రతను భారత పాకిస్తాన్‌ ప్రభుత్వాలు రెండూ గుర్తించక తప్పని పరిస్థితిని ట్రంప్‌ వెల్లడించారు. ట్రంప్‌ నుంచి వచ్చిన ఈ రెండు జోక్యాలు ప్రభుత్వం ప్రభుత్వం ఒత్తిడికి తట్టుకోలేక పోయిన అసహాయతను బహిర్గతం చేశాయి. వారు కోరిన మేరకు వంద కోట్ల డాలర్ల రుణం వేగంగా మంజూరు చేయడం ద్వారా పాకిస్తాన్‌ పాలక వ్యవస్థకు ఆశీర్వాదం లభించింది. పాకిస్తాన్‌ సైనిక దళాలు అత్యున్నత పాత్ర వహిస్తున్నప్పుడు ఈ డబ్బు ఎవరి చేతిలో పోతుందో ఎవరైనా ఊహించవచ్చు.సైనిక చర్యలతో పాటు దౌత్యపరమైన మార్గాల వంటివి కూడా అన్వేషించాలని ప్రతిపక్షాలు చేసిన సూచనను పెడచెవిన పెట్టడమే ఇక్కడ విషాదంగా మారింది. ఈ సూచనను విస్మరించిన దాని ఫలితం ఇప్పుడు అందరికీ కనిపిస్తుంది. 25 సభ్య దేశాలుగల ఐఎంఎఫ్‌ పాలక మండలిలో ఇండియా ఒక్కటే ఏకాకిగా ఓటింగ్‌ నుంచి దూరంగా ఉండిపోవాల్సి వచ్చింది. టెర్రరిస్ట్‌ కార్యకలాపాలకు ప్రేరణగా నిలిచిన పాకిస్తాన్‌ ఏకగ్రీవంగా రుణం పొందగలిగింది. ప్రధానమంత్రి దేశాన్ని ఉద్దేశించి ప్రసంగించడానికి కొన్ని గంటల ముందే ట్రంప్‌ ఈ దారుణ పరిస్థితికి మరింత ఆజ్యం పోశారు. ఎవరూ ఏదీ ఊహించుకోవాల్సిన అవసరం లేకుండా చేశారు ఆయన. రెండు ఇరుగు పొరుగు దేశాలను లొంగదీసుకోవడానికి ఆర్థిక వాణిజ్య అస్త్రాలను అమెరికా ప్రయోగించినట్లు ట్రంప్‌ ప్రకటించాడు.
దీనస్థితిలో వీరంగం
మొత్తానికి చూస్తే భారతదేశ మృతుల గురించిన ప్రస్తావన లేదు. పహల్గాం ఘాతుకానికి పాల్పడిన వారి అప్పగింత లేదు. భారతదేశ సామాన్యులు ఎదుర్కొన్న విపరీత సమస్యల సంగతి సరేసరి. ఇవన్నీ ఒక దీనాతిదీన పరిస్థితిని ప్రతిబింబిస్తున్నాయి. టెర్రరిస్టులు మతపరమైన విభజన తేవాలని చాలా గట్టి ప్రయ త్నాలే చేశారు. ఆ విషయం విదేశాంగ శాఖ కార్యదర్శి సూటిగానే ఒప్పుకున్నారు. అలాంటి సమయంలో ఈ విద్వేష ప్రచారాలపై పోరాటం అన్నది టెర్రరిజం పైన విస్తఅత పోరాటంలో భాగం కావాల్సింది. కానీ హతవిధీ! హిందుత్వ దళాల విద్వేష ప్రచార యంత్రాంగం రక్తపిపాసతో రేగిపోయింది. వచ్చిన ఈ ఫలితాన్ని అంగీకరించడానికి అది సిద్ధంగా లేదు. వారి దురాగ్రహం మనం అర్థం చేసుకోవచ్చు. మే 8వ తేదీన వారు వీరావేశంతో ఊగి పోయారు. ప్రధాన మీడియాలో కూడా కట్టు కథలతో నిజాలను కప్పిపుచ్చుతూ చిందులు తొక్కారు. పాకిస్తాన్‌ ఏ స్థాయిలో సర్వనాశనమై పోయిందో కథలు కథలుగా వినిపించారు.ఈ పోకడలు దేశ ప్రయోజనాలకు హాని కలిగించాయి. అంతర్జా తీయ సమాజంలో భారత దేశ ప్రతిష్టను దెబ్బతీశాయి. అందు వల్లనే ఇది లౌకిక దేశమని, కార్యశీల ప్రజాస్వామ్యమని వివరిం చేందుకు విదేశాంగ కార్యదర్శి, సాయుధ బలగాల ప్రతి నిధులు ఎంతో శ్రమపడ్డారు. తమ ‘అధినేత’ను ప్రశ్నించలేని పరిస్థితిలో పై శక్తులు విదేశాంగ కార్యదర్శిని లక్ష్యంగా చేసు కోవటం ఆశ్చర్యం కలిగించదు. హిమాన్షి నర్వాల్‌ తర్వాత వారి ఘోరమైన ట్రోలింగుకు గురైన వ్యక్తి విదేశాంగ కార్యదర్శి అయ్యారు.
ఏకైక మార్గం
ఈ సంక్షోభం నుంచి బయటికి రావాలంటే ప్రభుత్వానికి ఉన్న ఒకే ఒక మార్గం విషయాలను తేటతెల్లంగా వెల్లడించడమే. దురుద్దేశ పూర్వకమైన ఏకపక్ష కట్టుకథల అతిశయోక్తులు ప్రధాన మంత్రి వినిపించడం పార్లమెంట్‌లో నిర్మాణాత్మకమైన చర్చకు ప్రత్యామ్నాయం కాదు. ఒక కార్యశీల ప్రజాస్వామ్యంలో ఇలాంటి చర్చ జరపడం కనీస అవసరం.ఇదిలా ఉంటే అమెరికా సామ్రాజ్యవాదం దక్షిణాసిియాలో ఒక సరికొత్త అనాగరిక పెత్తనం రుద్దడానికి చేస్తున్న ప్రయత్నాలు ఆందోళన కలిగిస్తు న్నాయి. ఇది భారత ప్రజలకు తీవ్ర ప్రమాదాలు తెచ్చిపెట్టే పరిస్థితి. ఈ ప్రమాదాన్ని పూర్తిగా ఎదుర్కొని నిలబడటంలో మన దృఢ సంకల్పం ద్విగుణీకృతం కావలసిన సందర్భం.
(మే14 ‘పీపుల్స్‌ డెమోక్రసీ’ సంపాదకీయం)

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -