Wednesday, December 17, 2025
E-PAPER
Homeఆదిలాబాద్ప్రశాంతంగా ముగిసిన మూడో విడత ఎన్నికలు

ప్రశాంతంగా ముగిసిన మూడో విడత ఎన్నికలు

- Advertisement -

మండలంలో82.73శాతం నమోదు
ఓటింగ్ సరళిని పరిశీలించిన జనరల్ అబ్జర్వర్ ,జిల్లా కలెక్టర్, ఎస్పీ లు
నవతెలంగాణ – ముధోల్ 

మూడో విడత పంచాయతీ పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. ముధోల్ మండలం లో 82.73శాతం ఓటింగ్ జరిగింది. 10862 పురుషులు,11942 మహిళలు మొత్తం 22804 ఓట్లు పోలింగ్ అయ్యాయి.ఇందులో ఈ మేరకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. ఓటర్లు ఉదయం నుంచే పోలింగ్‌ కేంద్రాలకు తరలి వచ్చారు. గ్రామాల్లో ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.. మధ్యాహ్నం ఒంటి గంట వరకు క్యూలో నిల్చున్న వారికి ఓటేసేందుకు అవకాశం కల్పించారు.  మండలంలో17 సర్పంచ్‌లు, 113 వార్డులకు ఎన్నికలు నిర్వహించారు. ఉదయం 7గంటలకు పోలింగ్‌ ప్రారంభమైంది. ఉదయం 9గంటల వరకు 27.09శాతం ఓట్లు మాత్రమే పోలయ్యాయి. అనంతరం పోలింగ్‌ శాతం పుంజుకుంది. 11గంటల వరకు 56 .28శాతం, మధ్యాహ్నం ఒంటి గంట వరకు 77.21శాతం, ఆ తర్వాత 82.73 శాతం నమోదైంది.  ఎప్పటికప్పుడు పొలింగ్ సరళిని డిఎల్పిఓ లక్ష్మణ్, తహసిల్దార్ శ్రీలత ,ఎంపీడీవో లవ కుమార్  తెలుసుకొని పర్యవేక్షించారు.

ఓటర్లు ఈ పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు ఉత్సాహం  కనబరిచారు ఉదయం నుండే తన పోలింగ్ కేంద్రాల వద్దకు వెళ్లి వరుసలో నిలబడ్డారు. వృద్ధులకు వికలాంగులకు సంబంధించిన సిబ్బంది వీల్ చైర్ ల సౌకర్యాన్ని కల్పించారు. పోలింగ్‌ సరళిని  జనరల్  అబ్జర్వర్  ఆయేషా మస్రత్ ఖానం,కలెక్టర్‌ అభిలాష అభినవ్  ,జిల్లా ఎస్పీ  జానకీ షర్మిల లు పరిశీలించారు.ఓటర్లతో మాట్లాడారూ.ఈసందర్భంగా ఓట్ల లెక్కింపు పై ముధోల్ ఆర్ఓ తో మాట్లాడి పలుసలహా సూచనలు ఇచ్చారు. ఓట్ల లెక్కింపు సమయంలో అధికారుల కు తప్ప ఆభ్యర్థులు,ఏజంట్ లకు ఫోన్ అనుమతించబడదని సూచించారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించాలని ఆదేశించారు.కలెక్టర్ వెంట సబ్ కలెక్టర్  అజ్మీర సంకేత్ కుమార్,ప్రత్యేక అధికారి సుదర్శన్ రాథోడ్ ఉన్నారు

బందోబస్తు పర్యవేక్షించిన జిల్లా ఎస్పీ జానకి షర్మిల 
ముధోల్ పోలింగ్ స్టేషన్ లను బుధవారం నిర్మల్  జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల పర్యవేక్షించారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టిన జిల్లా పోలీసు యంత్రాంగం ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా ముగిసే వరకు జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక పోలీస్ నిఘా ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. మూడవ విడత పంచాయతీ ఎన్నికలు కూడా సజావుగా,శాంతియుత వాతావరణంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా నిర్వహించాలనే లక్ష్యంతో జిల్లా వ్యాప్తంగా పోలీస్ యంత్రాంగం పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపట్టిందన్నారు. ఈ నేపథ్యంలో భాగంగా పలు పోలింగ్ కేంద్రాల వద్ద ఏర్పాటు చేసిన పటిష్ట బందోబస్తును పర్యవేక్షించారు. . ఈ సందర్భంగా పోలింగ్ కేంద్రాల పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన పటిష్ట పోలీస్ బందోబస్తు, ప్రవేశ–నిష్క్రమణ మార్గాలు, బ్యారికేడింగ్, సీసీటీవీ పర్యవేక్షణ, క్యూలైన్ల నిర్వహణ తదితర అంశాలను జిల్లా ఎస్పీ సమగ్రంగా పరిశీలించారు.

పోలింగ్ సిబ్బంది, భద్రతా సిబ్బంది సమన్వయంతో విధులు నిర్వహించాలని, ఓటర్లు నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా అనుకూల వాతావరణం కల్పించాలని ఆదేశించారు. అలాగే పోలింగ్ సమయంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ప్రయత్నాలు చేసిన వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ హెచ్చరించారు. జిల్లా పోలీస్ శాఖ ఎన్నికల విధుల్లో అప్రమత్తంగా వ్యవహరిస్తూ, పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసే వరకు నిరంతర నిఘా కొనసాగిస్తుందని తెలిపారు.  ముధోల్ మండలంలో ఎఎస్పీ రాజేష్ మీనా  నేతృత్వంలో ముధోల్ సిఐ మల్లేష్, ఎస్ఐ బిట్ల పెర్సెస్ ఆధ్వర్యంలో పోలీసులు గట్టి బందోబస్తు ను ఏర్పాటు చేశారు.ఈ పర్యవేక్షణలో  భైంసా ఏ ఎస్పీ రాజేష్ మీన, పోలీసు అధికారులు, సిబ్బంది, తదితరులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -