Wednesday, December 17, 2025
E-PAPER
Homeతాజా వార్తలుహ్యాండ్లూమ్ అభివృద్ధికి అదనపు నిధులు కేటాయించాలి: ఎంపీ చామల

హ్యాండ్లూమ్ అభివృద్ధికి అదనపు నిధులు కేటాయించాలి: ఎంపీ చామల

- Advertisement -

నవతెలంగాణ – ఆలేరు 
హ్యాండ్లూమ్ రంగాన్ని కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం అత్యధిక నిధులు కేటాయించాలని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కోరారు. హ్యాండ్లూమ్ అండ్ హ్యాండీక్రాఫ్ట్ ఆధ్వర్యంలో జరిగిన సదస్సులో భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి పాల్గొని మాట్లాడారు.బుధవారం నాడు ఢిల్లీలో  జరిగిన ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్రంలో చేనేత పరిశ్రమ నమ్ముకుని ఆధారపడి  జీవనం సాగిస్తున్నారని చెప్పారు.ముఖ్యంగా భువనగిరి పార్లమెంట్ పరిధిలో పోచంపల్లి పరిసర ప్రాంత గ్రామాలతో పాటు రఘునాథపురం ఆలేరు కొలనుపాక టంగుటూరు తో పాటు సిరిసిల్ల జగిత్యాల వేలాది మంది చేనేత వృత్తిపైనే జీవన్ సాగిస్తున్నారని వారిని కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాల్సిన బాధ్యత ఉందన్నారు.చేతివృత్తులను కాపాడాలని భవిష్యత్ తరాలకు అందించాలని అందుకోసం బడ్జెట్లో అధిక నిధులు కేటాయించాలన్నారు. ఈఎస్ఐ పీఎఫ్ ప్రభుత్వ సామాజిక బాధ్యతగా భావించి వారికి ఇవ్వాలన్నారు. 

బ్యాంక్ ఎంప్లాయిస్ సదస్సులో… 
ఆల్ ఇండియా రీజినల్ రూరల్ బ్యాంక్ ఎంప్లాయిస్ అసోసియేషన్ నిర్వహించిన సదస్సులో పాల్గొని మాట్లాడుతూ గ్రామీణ బ్యాంకులను పబ్లిక్ సెక్టార్ లో కొనసాగించాలని ప్రభుత్వాన్ని కోరారు.ప్రైవేటీకరణ ప్రతిపాదన నిలిపివేలని డిమాండ్ చేశారు.గ్రామీణ బ్యాంకులో రైతులకు స్వయం సహాయక సంఘాలకు విద్యార్థులకు అందుబాటులో ఉండడంతో ఆర్థిక లావాదేవీలు సులువయ్యాయి అన్నారు.చేనేత కార్మిక సమస్యలు బ్యాంక్ ఎంప్లాయిస్ సమస్యలు పార్లమెంట్లో ప్రస్తావిస్తానని ఈ సందర్భంగా పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -