నవతెలంగాణ – మల్హర్ రావు
మూడో దశ గ్రామ పంచాయితీ ఎన్నికల నిర్వహణలో భాగంగా రెవెన్యూ అదనపు కలెక్టర్ అశోక్ కుమార్ పలు మండలాల్లోని పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేశారు. మహాముత్తారం మండలంలోని పోలింగ్ కేంద్రాన్ని, అలాగే వజినేపల్లి గ్రామ పంచాయితీలోని పోలింగ్ కేంద్రాన్ని ఆయన సందర్శించారు. అనంతరం కాటారం మండలంలోని చింతకాని గ్రామ పంచాయితీ పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించారు.
అలాగే కాటారం మండలంలోని రేగులగూడెం గ్రామ పంచాయితీ పోలింగ్ కేంద్రం, మల్హర్‌రావు మండలంలోని కొయ్యూరు గ్రామ పంచాయితీ పోలింగ్ కేంద్రాలను కూడా ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అదనపు జిల్లా కలెక్టర్ అశోక్ కుమార్ పోలింగ్ ప్రక్రియ సజావుగా, ప్రశాంతంగా నిర్వహించేలా అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఓట్లు లెక్కింపు కేంద్రాల్లో ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.



